
టీమిండియా టెస్టు కెప్టెన్సీని అద్బుతమైన సెంచరీతో ఆరంభించిన శుభ్‌మన్ గిల్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. భారత వన్డే సారథిగా తొలి మ్యాచ్‌లో గిల్ విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఔటైన సమయంలో బాధ్యతయతంగా ఆడాల్సిన గిల్.. పేలవ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. భారత ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన నాథన్ ఈల్లీస్.. తొలి బంతిని గిల్‌కు లైగ్ సైడ్ డెలివరీగా సంధించాడు. బౌలర్ ట్రాప్‌లో పడ్డ గిల్ ఆ డెలివరీని డౌన్‌ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.
కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో వికెట్ కీపర్ ఫిలిప్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే గిల్ ఔటయ్యాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన గిల్.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాప్ కార్న్ తింటూ రిలాక్స్‌గా కన్పించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంచెం బాధ లేకుండా పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవుతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు. ఇంకా 17 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(11) తీవ్ర నిరాశపరిచారు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు
😭😭 #RohitSharma𓃵 #ShubmanGillpic.twitter.com/DCNj5q3Spu
— 𝓗𝓲𝓽𝓶𝓪𝓷 (@Slefless45) October 19, 2025