
టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇకపై ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో భారత్‌కు వహిస్తున్న నితీశ్ .. తాజాగా వన్డేల్లోకి కూడా అడుగుపెట్టాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా నితీశ్ భారత్ తరపున 50 ఓవర్ల క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తేడాది నవంబర్ 22వ తేదీ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ డెబ్యూ క్యాప్ అందుకున్న ఈ తెలుగు కుర్రాడు.. ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదగా వన్డే క్యాప్‌ను తీసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన నితీశ్..
93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో పెర్త్ వేదికగా టెస్ట్, వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 1932 నుంచి భారత్ క్రికెట్ ఆడుతున్నప్పటికి ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. 2024/25 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పెర్త్ వేదికగా టెస్టుల్లో డెబ్యూ చేసిన నితీశ్.. యాదృఛ్చికంగా ఏడాది తర్వాత అదే మైదానంలో వన్డే అరంగేట్రం చేశాడు.
ఇంతకముందు పెర్త్ వేదికగా బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. హర్షిత్ రాణా, వినయ్ కుమార్‌లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. కానీ నితీష్ ఒక్కడే రెండు వైట్ బాల్ ఫార్మాట్‌లలోనూ పెర్త్‌లో డెబ్యూ చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), కోహ్లి(0), గిల్(10) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్ వుడ్, ఈల్లీస్ తలా వికెట్ సాధించారు. అయితే వర్షం కారణంగా ఆట ఆగిపోయింది.
చదవండి: Virat Kohli: రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?