
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతృతగా ఎదురు చూసిన అభిమానులను కింగ్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ డకౌటయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లి తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని అంతా భావించారు. కానీ ఈ ఢిల్లీ ఆటగాడు అందరి అంచనాలను తారుమారు చేశాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అతడు ఇబ్బంది పడుతూ కన్పించాడు.
వరుసుగా ఏడు బంతుల్లో సింగిల్ రన్ కూడా రాకపోవడంతో విరాట్‌పై ఒత్తడి పెరిగింది. ఈ క్రమంలో 7 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపుల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని కోహ్లి డ్రైవ్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో కూపర్ కొన్నోలీ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో కోహ్లి డకౌట్‌గా మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి.
అయితే వన్డే ప్రపంచకప్-2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. ఈ తరహా ప్రదర్శనలు కనబరిస్తే భారత జట్టులో చోటు గల్లంతే అని చెప్పుకోవాలి. ఫిట్‌నెస్ పరంగా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వరల్డ్‌కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటివరకు అతడు ఫామ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నర్థకంగా మారింది.
మరోవైపు యువ ఆటగాళ్ల నుంచి కోహ్లి తీవ్ర పోటీ ఎదురు అవుతోంది. దీంతో కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన రీఎంట్రీలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
చదవండి: IND vs AUS: ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగా
Mitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025