
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.7 నెలల తర్వాత భారత జట్టులోకి హిట్‌మ్యాన్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ అందరి ఆశలను ఈ మాజీ కెప్టెన్ ఆడియశలు చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లు బౌన్సర్లతో రోహిత్‌ను భయపెట్టారు.
భారత్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ స్లిప్స్‌లో దొరికిపోయాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని హేజిల్‌వుడ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ బంతిని రోహిత్ ఆడకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.
కానీ బంతిని ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాట్ రెన్‌షా చేతికి వెళ్లింది. దీంతో 14 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. మైదానం వీడాల్సి వచ్చింది. పెర్త్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. ఈ విధంగా ఔట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో శుభ్‌మన్ గిల్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్‌కు భారత్ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్