టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.
ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భారత తరపున ఇప్పటివరకు 274 వన్డేలు, 67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గత ఏడాది జూన్‌లో టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. నాలుగు నెలల కింద టెస్టుల నుంచి తప్పుకొన్నాడు.
ఈ ముంబైకర్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో 19,708 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264(వన్డేల్లో)గా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్ భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
500 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ప్లేయర్స్ వీరే
👉 సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌లు
👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్‌లు
👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్‌లు
👉 రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్‌లు
👉రోహిత్ శర్మ – 500 మ్యాచ్‌లు
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు


