టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ పునరాగనమంలో సత్తాచాటుతున్నాడు. మొన్న అడిలైడ్‌లో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న హిట్‌మ్యాన్.. ఇప్పుడు సిడ్నీలో మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్బుతమైన శతకంతో చెలరేగాడు. కేవలం 105 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్‌కు ఇది 33వ వన్డే సెంచరీ కావడం విశేషం. 237 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు.
తొలుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్.. ఆ తర్వాత మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. రోహిత్ సెంచరీ మార్క్‌ను అందుకోగానే సిడ్నీ స్టేడియం దద్దరిల్లిపోయింది. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు.
అతడితో పాటు విరాట్ కోహ్లి(74 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్‌ల ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది.
చదవండి: #Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్


