ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశారు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రో-కో ద్వయం.. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.
ఈ సీనియర్ క్రికెటర్లు మరో రెండేళ్ల పాటు జట్టులో కొనసాగే అవకాశమున్నప్పటికి టీమిండియా మాత్రం ఇప్పటిలో వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లదు. మళ్లీ భారత జట్టు 2028లో ఆసీస్ టూర్‌కు వెళ్లే అవకాశముంది.
అప్పటికి కోహ్లి-రోహిత్‌ల వయస్సు 40 ఏళ్లు దాటుతుందున్నందన భారత జట్టులో కొనసాగే ఛాన్స్ లేదు. దీంతో శనివారం సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేనే కోహ్లి-రోహిత్‌కు ఆసీస్ గడ్డపై ఆఖరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు.
రోహిత్ శర్మ(121) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే క్రికెట్‌లో ఈ సీనియర్ జోడీకి 12వ 150 ప్లస్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాలో జ్ఞాపకాలను రో-కో గుర్తు చేసుకున్నారు.
"నేను ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. 2008 నుంచి ఇక్కడ ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు మాకు మరొక అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతీ క్షణాన్ని అస్వాధించాము. ఇక్కడ మాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు": రోహిత్
"ఆస్ట్రేలియాలో ఆడేందుకు మేము ఎంతో ఇష్టపడతాము. ఈ గడ్డపై మా నుంచి ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. ఇక్కడ అభిమానులు మద్దతు నిజంగా ఒక అద్భుతం. అందరికీ చాలా థాంక్స్: విరాట్ కోహ్లి
చదవండి: IND vs AUS: తీవ్ర గాయం! అస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన


