అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ ఎడమ పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో అడడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఏ మాత్రం నొప్పి తగ్గలేదు.
దీంతో అతడు మైదానాన్ని వీడి వెళ్లాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అయ్యర్ తిరిగి ఫీల్డ్‌లోకి రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టార్గెట్‌ను పూర్తి చేయడంతో శ్రేయస్‌కు బ్యాటింగ్‌కు ఛాన్స్ రాలేదు. ఒకవేళ అతడి వరకు బ్యాటింగ్‌కు వచ్చినా కూడా డ్రెస్సింగ్ రూమ్ పరిమితమయ్యేవాడు. తాజాగా శ్రేయస్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.
అయ్యర్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్
"ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకకు గాయమైంది. అతడి గాయం తీవ్రత తెలుసుకోనేందుకు ఆస్ప్రత్రికి తరలించారు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అయ్యర్ గాయం తీవ్రమైనది కాకుడదని అభిమానులు కోరుకుంటున్నారు.
అతడు భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇటీవలే వైస్ కెప్టెన్‌గా కూడా ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత మిడిలార్డర్‌లో అయ్యర్ ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అడిలైడ్ వన్డేలో కూడా శ్రేయాస్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సమయానికి అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది.
వచ్చే నెల ఆఖరిలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఆఖరి వన్డే విషయానికి వస్తే.. ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో చేధించింది. భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) ఆర్ధ శతకంతో సత్తాచాటాడు.
చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్


