టీమిండియా స్టార్ జోడీ విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగియడంతో రో-కో ద్వయం దాదాపు 6 నెలల పాటు భారత జెర్సీలో కన్పించరు. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో వీరిద్దరూ భారత్ తరపున ఆడనున్నారు.
అంతకంటే మందు జూన్‌లో అఫ్గానిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఒకవేళ అఫ్గానిస్తాన్‌తో భారత్ ఆడితే విరాట్-రోహిత్ కూడా బరిలోకి దిగనున్నారు. లేదంటే ఆ తర్వాత నెలలో ఇంగ్లండ్‌పై కచ్చితంగా ఆడనున్నారు.
కాగా ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలు.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో వన్డేల తర్వాత టీమిండియా టీ20 సిరీస్‌లు ఎక్కువగా ఆడనుంది. వీరిద్దరూ టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డే సిరీస్ షెడ్యూల్ వరకు అభిమానులు అగాల్సిందే.
అయితే ఈ సీనియర్ ప్లేయర్లు ఐపీఎల్‌లో మాత్రం తమ తమ జట్లు తరపున సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆఖరిలో మాత్రం విరాట్, రోహిత్ వరుస అంతర్జాతీయ సిరీస్‌లలో బీజీబీజీగా గడపనున్నారు. ఇంగ్లండ్‌తో వన్డేలు ముగిసిన తర్వాత సెప్టెంబర్‌లో భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య విండీస్‌తో మెన్ ఇన్ బ్లూ 3 వన్డేలు ఆడనుంది. అనంతరం అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
విరాట్ హిట్.. రోహిత్ ఫట్
ఇక తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి దుమ్ములేపితే.. రోహిత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ సిరీస్‌లో కోహ్లి మొత్తంగా 240 పరుగులు చేసి భారత తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో కూడా కోహ్లి వీరోచిత శతకంతో పోరాడాడు. రోహిత్ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: IND vs NZ: వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం!


