breaking news
Taj Mahal hotel
-
ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్
భోజనం హాయిగా నచ్చిన విధంగా ఆస్వాదిస్తేనే కదా మజా..!. దానికి కూడా ఆంక్షలు అంటే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఎవ్వరికైనా. అది సహజం. అందులోనూ సరదాగా వీకెండ్లో నచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నా..ఇలాంటి మాటలు ఎదురైతే ఎవ్వరికైన ఒళ్లు మండిపోతుంది. అలాంటి అనుభవవే యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మకి ఎదురైంది. పాపం ఆమె ఇదేంటి డబ్బులు కట్టేది కూడా నేనే అయినప్పుడూ ఇదేంటంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..ఆమె ఢిల్లీలో హౌస్ ఆఫ్ మింగ్లో ప్రసిద్ధ తాజ్ మహల్ హోటల్‌కి వెళ్లింది. ఆ హోటల్లో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. దీపావళి సందర్భంగా ఏదైనా వెరైటీగా చేయాలనకున్నామని తెలిపింది. ఆ నేపథ్యంలోనే తను సోదిరితో కలిసి తాజ్ హోటల్లో విందుకు వచ్చినట్లు వెల్లడించింది. అంతా బాగానే సాగుతుండగా ఇంతలో మేనేజర్ వచ్చి అతిథుల్లో ఒకరికి మీ వల్ల ఇబ్బంది ఉందంటూ..సరిగా కూర్చొమని చెప్పడం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ శ్రద్ధా కూర్చిమీదనే షూస్ వదిలేసి పద్మాసనంలో కూర్చొన్నారు. అది మన భారతీయ సంప్రదాయ విధానమే. అయినా..అలా అనడం శ్రద్ధాని బాగా బాధించడంతో ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వివరిస్తూ..తానెలా కూర్చొందో కూడా వీడియో రూపంలో చూపించింది. ఇది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని తనకు తెలుసని, ఇక్కడకు చాలామంది ధనవంతులు వస్తుంటారని తనకు తెలుసంటూ ఆగ్రహంగా మాట్లాడారామె. అయినా తాను సంపాదించిన డబ్బుతోనేగా ఇక్కడకు రాగలిగింది అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికో సమస్య ఉంటే ..తనను ఇలా కాళ్లు దించి సరిగా కూర్చోమని చెప్పడం సరికాదు, ఎందుకంటే డబ్బులు కట్టేది తానే కదా అంటూ వాపోయారు. ఇక్కడ సంస్కృతిని, సంపదతో వేరుచేసి చూస్తూ..గోడలు కట్టుకుంటున్నామంటూ మండిపడ్డారమె. అయినా తాను సల్వార్ కుర్తా ధరించి సరిగానే కూర్చొన్నా, మర్యాదగానే ప్రవర్తించాన, మరి దీనికెందుకు అభ్యంతరం చెప్పాలంటూ నిలదీశారు. నిజానికి పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఇవాళ ఆయనకు చెందిన తాజ్ హోటల్ తనను చాలా నిరాశపరిచేలా అవమానించిందని బాధగా చెప్పుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ పోస్ట్‌ని చూసి..లగ్జరీ హోటళ్లు డ్రెస్ కోడ్లంటూ ప్రవర్తన నియమావళి పెడుతున్నారని, ఇవి తప్పనిసరి కాదంటూ ఆమెకు మద్దతు పలికారు. అయినా సరదాగా విందుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడూ ఆ సమయం మనది మనకు నచ్చినట్లు ప్రవర్తించే హక్కు ఉందని, ఎందుకంటే ఆ వ్యవధికి బిల్లు చెల్లించేది మనమే కదా అంటూ శ్రద్ధని సపోర్టు చేస్తూ పోస్టుల పెట్టడం గమనార్హం. మనం వెళ్లే ప్రదేశం బట్టి దానికి అనుగుణంగా మన వ్యవహారశైలి ఉండాలి గానీ, మరి ఇలా సవ్వంగా ఉన్నాకూడా అతి చేస్తే..అసలుకే పెనుముప్పు కదూ..!. హాయిగా ఆస్వాదించే భోజనం వద్ద ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం.एक आम इंसान, जो मेहनत करके, अपना पैसा कमा कर, अपनी इज़्ज़त के साथ ताज होटल में आता है — उसे आज भी इस देश में ज़लील और अपमानित होना पड़ता है।और मेरी गलती क्या है? सिर्फ़ ये कि मैं बैठ गई एक “regular padmasana style” में?क्या ये मेरी गलती है कि ताज मुझे सिखा रहा है कि कैसे बैठना… pic.twitter.com/vKBYjg8ltb— Shradha Sharma (@SharmaShradha) October 21, 2025 (చదవండి: శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..) -
7న బీసీ పారిశ్రామిక వేత్తల సమ్మేళనం
పంజగుట్ట: రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నగరం ఆబిడ్స్ లోని తాజ్‌మహల్ హోటల్లో సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ పారిశ్రామిక వేత్తల సమాఖ్య తెలిపింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పారిశ్రామికవేత్తల సమ్మేళనం పోస్టర్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి వకుళాభరణం కృష్ణమోహన్, సమాఖ్య చైర్మన్ మర్రి ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ పారిశ్రామికవేత్తలను, కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులను ఒకే చోట సమావేశపరచి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణలో బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించి ప్రోత్సహించాలన్నారు. -
‘గే’ల మధ్య గలాటా
యువకుడి దుర్మరణం నిందితుడు రిటైర్డ్ డిప్యూటీ డెరైక్టర్ హిమాయత్‌నగర్: విచక్షణ మరిచిన ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి తీరు సభ్య సమాజం తలదించుకొనేలా చేసింది. పదుగురికి స్ఫూర్తిగా నిలవాల్సిన ఆయన వికృత చేష్టలు ఓ నిండుప్రాణం గాలిలో కలసిపోయేలా చేసింది. ‘తోడు’ కోసం తెచ్చుకున్న ఓ యువకుడిని మూడో అంతస్తు పైనుంచి తోసేయడంతో దుర్మణం పాలయ్యాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన నారాయణగూడ లింగంపల్లిప్రాంతంలో సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు...పరిశ్రమల శాఖ (చిరాక్ అలీలేన్)లో డిప్యూటీ డెరైక్టర్‌గా వి. నరసింహారావు 2011లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన ఓ న్యాయవాది వద్ద స్టెనో కం టైపిస్టుగా పనిచేస్తున్నారు. న్యాయవాది కార్యాలయం నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగంపల్లికి చెందిన అన్నపూర్ణ ఏఎస్ఎన్ రెసిడెన్సీ 3వ అంతస్తులో ఉంది. పని ఎక్కువగా ఉండటంతో సోమవారం రాత్రి 10 గంటల వరకూ కార్యాలయంలోనే ఉన్నారు. తర్వాత అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్ వద్దకు వెళ్లారు. వాస్తవానికి నరసింహారావు స్వలింగసంపర్కుడు (గే). అక్కడ గుర్తు తెలియని యువకుడు పరిచయమయ్యాడు. రాత్రి నరసింహారావుతో ఉండేందుకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. అక్కడ నుంచి వారు న్యాయవాది కార్యాలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. తన కోరిక తీర్చలేదంటూ ఆ యుకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడో అంతస్తుపై నుంచి తోసేశాడు నరసింహారావు. ఆ యువకుడు కాంపౌండ్వాల్పై పడిపోయాడు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నారాయణగూడ పోలీసులు అటుగా వచ్చి పైనుంచి పడిన యువకుడ్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే యువకుడు చనిపోయాడు. పోలీసులు నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. అయితే మృతి చెందిన యువకుడు కూడా ‘గే’గానే అనుమానిస్తున్నారు.


