కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే! | Viral Video: Punjab Woman Fights Off Robbers In Moving Auto | Sakshi
Sakshi News home page

కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే!

Sep 10 2025 9:15 PM | Updated on Sep 10 2025 9:48 PM

Viral Video: Punjab Woman Fights Off Robbers In Moving Auto

పంజాబ్‌లో ఓ మహిళ.. దొంగలతో ధైర్యంగా పోరాడి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టపగలే ఆటోలో మహిళను దోచుకోవడానికి ప్రయత్నించిన షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిల్లౌర్‌కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు.

అయితే, ఆమె ధైర్యంగా  దుండగులను ప్రతిఘటించింది.. ఆటో నుంచి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆమె దాదాపు అర కిలోమీటర్‌ వరకు వేలాడుతూ సాయం కోసం ఆమె పిలుస్తూనే ఉంది. ఇంతలో, వెనుక కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు ఆటోను వెంబడించారు. ఆమె సాహసాన్ని వీడియో తీశారు. దొంగలను పట్టుకోవడానికి వారు సాయం చేశారు.

ఆటో వేగంగా వెళ్లి ఒక కారు‌ను ఢీకొట్టింది. చివరికి ఆటో బోల్తా పడింది. దాంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ వీడియోలో ఆ మహిళ ఆటోకు బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ధైర్యంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను కూడా పట్టించగలిగిందని.. ఈ ఘటన మహిళల ధైర్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement