
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్‌తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
బీహార్‌లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్‌కు చెందినవారు.
శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్‌ప్రెస్) రన్‌ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్‌లోని అనేక చోట్ల రైల్వే అండర్‌పాస్, ఓవర్‌బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.
నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్‌లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి.