మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మోడల్ ఖుష్బూ అహిర్వర్ అనుమానాస్పద మరణం కలకలం రేపింది. ఖుష్బూ ఖుషీగా పిలుచుకునే 21 ఏళ్ల మోడల్, ఖుష్బూ అహిర్వర్ సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై తేలింది. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బాధితురాలి తల్లి లక్ష్మీ అహిర్వర్ తన కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తోంది. ప్రైవేట్ భాగాలు , శరీరం అంతటా నీలిరంగు మచ్చలు ఉన్నాయనీ ముఖం ఉబ్బి ఉందనీ, తన కుమార్తెను దారుణంగా కొట్టి చంపారు అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమెను హత్య చేసిన వారిని శిక్షించాలని, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ జోక్యం చేసుకోవాలని ఆమె సోదరి డిమాండ్ చేసింది.
ఆమె కుటుంబం చెప్పిన వివరాల ప్రకారం, ఖుష్బూ 27 ఏళ్ల ఖాసిం అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. చివరిగా అతనే ఆమెను ఆసుపత్రిలో వదిలి వెళ్లాడు. అప్పటినుంచి అతడు పరారీలో ఉన్నాడు. బాధిత మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఖాసిం కోసం గాలింపు ప్రారంభించారు. ఖుష్బూ గాయాల స్వభావం దాడి, లైంగిక హింసకు సంబంధించిన అనుమానాలను కలిగిస్తోందని పోలీసులు అధికారులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని, లైంగిక దాడి , హత్యతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామనితెలిపారు.
@DiamondGirl30 అనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. భోపాల్ మోడలింగ్ రంగంలో ఇపుడిపుడే రాణిస్తోంది. బీఏ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి గత మూడేళ్లుగా భోపాల్‌లో ఉంటూ పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, మోడలింగ్‌లో అవకాశాలను దక్కించుకుంటోంది. గత మూడు రోజుల క్రితం కుటుంబంతో మాట్లాడింది.
చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం


