
మంద్‌సౌర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ లాల్ యాదవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కబోతున్న హాట్ ఎయిర్ బెలూన్ కు మంటలు అంటుకున్నాయి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆపివేశారు. ఇక్కడి గాంధీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నాయి. బలమైన గాలుల కారణంగా బెలూన్ ఎగరలేకపోయింది. అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను అదుపు చేశారు. భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి ట్రాలీని పట్టువడంతో ముఖ్యమంత్రి ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ముఖ్యమంత్రి బసచేసిన హింగ్లాజ్ రిసార్ట్ సమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం సీఎం గాంధీ సాగర్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంబల్ ఆనకట్ట బ్యాక్ వాటర్ ప్రాంతంలో క్రూయిజ్ రైడ్ చేశారు. గాంధీ సాగర్ ఫారెస్ట్ రిట్రీట్ అనేది మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు ప్రధాన ప్రాజెక్ట్. ఇది హాట్ ఎయిర్ బెలూనింగ్, పారామోటరింగ్, వాటర్ స్పోర్ట్స్‌కు ప్రసిద్ధి చెందింది.