 
													∙సమ్‌థింగ్ స్పెషల్
 
మధ్యప్రదేశ్‌కు చెందిన యువ రైతు ఆకాష్ చౌరాసియ (Akash Chaurasia) ప్రతిరోజు ఉదయం తన ΄పొలానికి వెళతాడు. ‘వెళ్లి ఏం చేస్తాడు?’ అనే ప్రశ్నకు ‘ఇంకేమి చేస్తాడు. ΄ పొలం పనులు’ అంటే పప్పులో కాలేసినట్లే.
అతడు వెళ్లేది పంట΄ పొలాలు, మొక్కలకు సంగీతం వినిపించడానికి!‘మనుషులే కాదు పంట పొలాలు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి. తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి’ అంటున్న ఆకాశ్ గత పది సంవత్సరాలుగా పంట పొలాలకు సంగీతం వినిపిస్తున్నాడు. కొత్త మొక్కలు నాటినప్పుడు స్పెషల్ మ్యూజికల్ థెరపీ సెషన్‌లు నిర్వహించడం అనేది మరో విశేషం.
‘మొక్కల ఎదుగుదలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుంది’ అంటున్నాడు ఆకాష్. ఆకాష్ మరో అడుగు ముందుకు వేసి ఆవులకు కూడా సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ‘ఆవులకు రోజూ సంగీతం వినిపించడం వల్ల గతంలో పోల్చితే అవి ఎక్కువ పాలు ఇస్తున్నాయి’ అని కూడా అంటున్నాడు. ఇదేదో బాగుంది కదూ..!
ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్‌లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్‌మెంట్ రింగ్ స్పెషల్!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
