
భోపాల్: యూకే రిటర్న్స్ డాక్టర్ పేరుతో ఓ వ్యక్తి ఆడిన నాటకం.. ఏడుగురి ప్రాణాలు తీసింది. కార్డియాలజీ స్పెషలిస్టునని ‘ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఒక ఆస్పత్రిలో జాయినయ్యాడు. ఇక అంతే స్పెషలిస్టు కదా అని .. మేజర్ ఆపరేషన్లను అతనికే అప్పగించింది ఆ ఆస్పత్రి యాజమాన్యం. అంతే అతను ఆపరేషన్లు చేసిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో అసలు విషయం బయటపడింది. అతను యూకే డాక్టర్ కాదని, కార్డియాలజిస్ట్ అంతకన్నా కాదనే విషయం వెలుగుచూసింది. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘంగా తీవ్రంగా స్పందించింది.
డాక్టర్ ఎన్ జాన్ కెన్ పేరుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు ఓ డాక్టర్. యూకేకు చెందిన కార్డియలాజిస్ట్ నని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ చూపించడంతో అతన్ని డాక్టర్ గా అపాయింట్ చేసుకున్నారు. ఇక అంతే వరుస పెట్టి ఆపరేషన్లు చేసేస్తున్నాడు. హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్ అయితే ఇక ఆపరేషన్ అంటున్నాడు.
ఆ ఆస్పత్రికి ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భవా స్కీమ్ కు కూడా ఉండటంతో పేషెంట్లు కూడా ఆపరేషన్ కు సరే అంటున్నారు. ఇలా 15 ఆపరేషన్లు చేయగా, 7 గురు చనిపోయారు. దాంతో దీనిపై ఆరా తీయగా అతను ఫేక్ డాకర్ట్ అనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని దామోహ్ చైల్డ్ వెల్ఫే్ కమిటీ అధ్యక్షుడు దీపక్ తివారీ వెలుగులోకి తేవడంతో ఆ డాక్టర్ అసలు కథ బయటపడింది. ఒక నెలలోనే అతను చూసిన ఏడుగురు మృతి చెందడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది.
ఫేక్ డాక్టర్ పై విచారణకు ఆదేశించాం
ఒక డాక్టర్ గా ఆస్పత్రిలో జాయిన్ అయి ఏడుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన సదరు ఫేక్ డాక్టర్ పై విచారణ జరుగుతోందని జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు తమకు ఫిర్యాదు అందిందని, ఏడుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన డాక్టర్ వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవా స్కీమ్ కింద ఆపరేషన్ చేసి ఆ నిధుల్ని కూడా దుర్వినియోగం చేశాడు’ అని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూన్ గో పేర్కొన్నారు.