
దేశంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రధాన వ్యాపార సంస్థలకు హాట్‌స్పాట్‌గా అవతరించింది. అనేక పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రవ్యాప్తంగా తమ ఉనికిని స్థాపించాయి. అంతేకాకుండా అనేక మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, అత్యంత సంపన్నులకు కేంద్రంగా కూడా మధ్య ప్రదేశ్ నిలిచింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని టాప్ 5 అత్యంత ధనవంతులెవరో (richest people) ఇప్పుడు చూద్దాం..
వినోద్ అగర్వాల్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో అత్యంత ధనవంతుడు వినోద్ అగర్వాల్. ఈయన అగర్వాల్ కోల్ కంపెనీ యజమాని. బొగ్గు వ్యాపారంలో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇండోర్‌కు చెందిన వినోద్ మొత్తం సంపద సుమారు రూ. 7,100 కోట్లు.
దిలీప్ సూర్యవంశీ
మధ్యప్రదేశ్‌లో రెండవ అత్యంత ధనవంతుడు దిలీప్ సూర్యవంశీ. దిలీప్ బిల్డ్కాన్ వ్యవస్థాపకుడైన దిలీప్ భోపాల్కు చెందినవారు. దిలీప్ బిల్డ్‌కాన్ లిమిటెడ్‌కు ఛైర్మన్, ఎండీగా ఉన్న ఈయన సంపద దాదాపు 3,800 కోట్లు. ఈయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 44 ఏళ్లుగా ఉన్నారు.
శ్యామ్‌సుందర్ మూంద్రా
ఉజాస్ ఎనర్జీ యజమాని అయిన శ్యామ్‌సుందర్ మూంద్రా మూడవ స్థానంలో ఉన్నారు. ఇండోర్కు చెందిన శ్యామ్‌సుందర్ నెట్‌వర్త్ దాదాపు 3,500 కోట్లని అంచనా. సౌరశక్తి రంగంలో పనిచేస్తున్న ఉజాస్ ఎనర్జీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో మూంద్రా కంపెనీ గణనీయమైన పాత్ర పోషించింది.
దినేష్ పాటిదార్
ఇండోర్‌కు చెందిన దినేష్ పాటిదార్ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దినేష్ శక్తి పంప్స్ యజమాని. ఆయన మొత్తం సంపద దాదాపు రూ. 3,400 కోట్లు. దినేష్ కంపెనీ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది.
సుధీర్ అగర్వాల్
ఐదవ స్థానంలో భోపాల్‌కు చెందిన సుధీర్ అగర్వాల్ ఉన్నారు. ఆయన సాగర్ మ్యానుఫ్యాక్చరర్స్ యజమాని. ఆయన సంపద దాదాపు 2,500 కోట్లు ఉంటుందని అంచనా. ఆయన వస్త్ర పరిశ్రమలో ప్రముఖ పేరు, సాగర్ గ్రూప్ విద్య, ఆరోగ్యం, పరిశ్రమ రంగాలలో గుర్తింపు పొందింది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు!