breaking news
Richest People
-
బిహార్ బిలియనీర్లు.. బిజినెస్‌లో తోపులు!
బిహార్ అంటే పేద రాష్ట్రం, నిరక్షరాస్యులు ఎక్కువ అనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంటుంది. కానీ బిహార్ (Bihar) సాంప్రదాయకంగా పండితులు, నాయకులు, సాంస్కృతిక గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా కూడా ఉంది.మైనింగ్ నుండి ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ సర్వీసులు, పునరుత్పాదక ఇంధనం, రాజకీయాల వరకు వివిధ రంగాల్లో సంకల్పం, విజన్‌తో వేల కోట్ల సంపదను ఎలా సృష్టించగలరో బిహార్ సంపన్నులు (Richest People In Bihar) చూపిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. 2025లో బిహార్ లోని టాప్ 10 ధనవంతులు, వారి వ్యాపార సామ్రాజ్యాలు, నెట్వర్త్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అనిల్ అగర్వాల్నెట్వర్త్: రూ.16,000–17,000 కోట్లుబిజినెస్: వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు (మైనింగ్ & మెటల్స్)నేపథ్యం: పాట్నాలో స్క్రాప్ డీలర్ గా ప్రారంభించిన అగర్వాల్ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వనరుల కంపెనీలలో ఒకదాన్ని నిర్మించారు. ఇప్పుడు లండన్ లో ప్రధాన కార్యాలయం ఉంది.రవీంద్ర కిషోర్ సిన్హానెట్వర్త్: రూ.5,000–10,000 కోట్లుబిజినెస్: SIS (సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్)నేపథ్యం: భారతదేశపు అతిపెద్ద సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీని నిర్మించిన మాజీ జర్నలిస్ట్.మహేంద్ర ప్రసాద్నెట్వర్త్: రూ .4,000 కోట్లు పైనేబిజినెస్: అరిస్టో ఫార్మాస్యూటికల్స్నేపథ్యం: "కింగ్ మహేంద్ర"గా పిలువబడే ఈయనది బిహార్ ఫార్మా ఉనికిలో కీలక పాత్ర.సంప్రదా సింగ్నెట్వర్త్: (2019లో మరణించడానికి ముందు): రూ .25,000 కోట్లు పైనేబిజినెస్: ఆల్కెమ్ లేబొరేటరీస్నేపథ్యం: తన సోదరుడితో కలిసి ముంబైలో ఆల్కెమ్ ను స్థాపించి, దానిని ప్రముఖ ఫార్మా బ్రాండ్ గా తీర్చిదిద్దారు.సుబ్రతా రాయ్నెట్వర్త్: రూ .3,000 కోట్లు పైనేబిజినెస్: సహారా ఇండియా (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా)నేపథ్యం: 1978లో సహారాను కనీస మూలధనంతో స్థాపించి, దానిని జాతీయ సమ్మేళనంగా నిర్మించారు.శుభమ్ సింగ్నెట్వర్త్: రూ.500+ కోట్లుబిజెనెస్: భారత్ ఊర్జా డిస్టిలరీస్ (ఇథనాల్ ప్లాంట్)నేపథ్యం: కేవలం 26 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఇంధన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా బిహార్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని నడిపించారు.సుభాష్ చంద్రనెట్వర్త్: రూ .5,000+ కోట్లుబిజినెస్: ఎస్సెల్ గ్రూప్, జీ మీడియానేపథ్యం: భారతదేశపు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించారు. బీహార్ వెలుపల ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు బిహార్‌తో ముడిపడి ఉన్నాయి.సుమంత్ సిన్హానెట్వర్త్: రూ .3,000+ కోట్లుబిజినెస్: రెన్యూ పవర్నేపథ్యం: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడైన సుమంత్ భారత క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రముఖ పేరు తెచ్చుకున్నారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్ -
వేల కోట్ల అధిపతులు.. ఎంపీలో టాప్ 5 ధనవంతులు వీళ్లే..
దేశంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రధాన వ్యాపార సంస్థలకు హాట్‌స్పాట్‌గా అవతరించింది. అనేక పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రవ్యాప్తంగా తమ ఉనికిని స్థాపించాయి. అంతేకాకుండా అనేక మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, అత్యంత సంపన్నులకు కేంద్రంగా కూడా మధ్య ప్రదేశ్ నిలిచింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని టాప్ 5 అత్యంత ధనవంతులెవరో (richest people) ఇప్పుడు చూద్దాం..వినోద్ అగర్వాల్హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో అత్యంత ధనవంతుడు వినోద్ అగర్వాల్. ఈయన అగర్వాల్ కోల్ కంపెనీ యజమాని. బొగ్గు వ్యాపారంలో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇండోర్‌కు చెందిన వినోద్ మొత్తం సంపద సుమారు రూ. 7,100 కోట్లు.దిలీప్ సూర్యవంశీమధ్యప్రదేశ్లో రెండవ అత్యంత ధనవంతుడు దిలీప్ సూర్యవంశీ. దిలీప్ బిల్డ్‌కాన్ వ్యవస్థాపకుడైన దిలీప్ భోపాల్‌కు చెందినవారు. దిలీప్ బిల్డ్‌కాన్ లిమిటెడ్‌కు ఛైర్మన్, ఎండీగా ఉన్న ఈయన సంపద దాదాపు 3,800 కోట్లు. ఈయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 44 ఏళ్లుగా ఉన్నారు.శ్యామ్‌సుందర్ మూంద్రాఉజాస్ ఎనర్జీ యజమాని అయిన శ్యామ్‌సుందర్ మూంద్రా మూడవ స్థానంలో ఉన్నారు. ఇండోర్‌కు చెందిన శ్యామ్‌సుందర్ నెట్‌వర్త్ దాదాపు 3,500 కోట్లని అంచనా. సౌరశక్తి రంగంలో పనిచేస్తున్న ఉజాస్ ఎనర్జీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో మూంద్రా కంపెనీ గణనీయమైన పాత్ర పోషించింది.దినేష్ పాటిదార్ఇండోర్కు చెందిన దినేష్ పాటిదార్ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దినేష్ శక్తి పంప్స్ యజమాని. ఆయన మొత్తం సంపద దాదాపు రూ. 3,400 కోట్లు. దినేష్ కంపెనీ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది.సుధీర్ అగర్వాల్ఐదవ స్థానంలో భోపాల్‌కు చెందిన సుధీర్ అగర్వాల్ ఉన్నారు. ఆయన సాగర్ మ్యానుఫ్యాక్చరర్స్ యజమాని. ఆయన సంపద దాదాపు 2,500 కోట్లు ఉంటుందని అంచనా. ఆయన వస్త్ర పరిశ్రమలో ప్రముఖ పేరు, సాగర్ గ్రూప్ విద్య, ఆరోగ్యం, పరిశ్రమ రంగాలలో గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు! -
మహారాష్ట్రలో అత్యంత ధనవంతులు.. అంబానీ తరువాత ఎవరంటే?
భారతదేశంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నరాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఒకటి. అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులకు ఈ రాష్ట్రం నిలయం. 2025లో సంపద విషయంలో మహారాష్ట్ర ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. మొత్తం మీద ఇండియాలోని బిలియనీర్లు ఇప్పుడు 1.1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది 2019తో పోలిస్తే.. రెట్టింపు కంటే ఎక్కువ. ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా వంటి దిగ్గజాలు ఈ రాష్ట్రానికి చెందినవారే. ఈ కథనంలో మహారాష్ట్రలోని కుబేరులు ఎవరో తెలుసుకుందాం.➤ముఖేష్ అంబానీ: 119.5 బిలియన్ డాలర్లు➤దిలీప్ సంఘ్వీ & ఫ్యామిలీ: 32.4 బిలియన్ డాలర్లు➤రాధాకిషన్ దమాని & ఫ్యామిలీ: 31.5 బిలియన్ డాలర్లు➤కుమార్ మంగళం బిర్లా: 24.8 బిలియన్ డాలర్లు➤సైరస్ పూనవాలా: 24.5 బిలియన్ డాలర్లు➤బజాజ్ ఫ్యామిలీ: 23.4 బిలియన్ డాలర్లు➤షాపూర్ మిస్త్రీ & ఫ్యామిలీ: 20.4 మిలియన్ డాలర్లు -
ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా
ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరం. ఇది రాజకీయాలకు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రం కూడా. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఎక్కువ మంది ధనవంతులు నివసిస్తున్న నగరాల్లో కూడా ఢిల్లీ స్థానం సంపాదించుకుంది. ఈ కథనంలో ఢిల్లీలోని అత్యంత ధనవంతులు ఎవరు?, వారి నెట్‌వర్త్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.➤శివ్ నాడార్: 40.2 బిలియన్ డాలర్లు➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 30.7 బిలియన్ డాలర్లు➤రవి జైపురియా: 17.3 బిలియన్ డాలర్లు➤బర్మన్ కుటుంబం: 10.4 బిలియన్ డాలర్లు➤కపిల్ & రాహుల్ భాటియా: 10.1 బిలియన్ డాలర్లు➤వినోద్, అనిల్ రాయ్ గుప్తా & కుటుంబం: 9.5 బిలియన్ డాలర్లు➤వివేక్ చాంద్ సెహగల్ & కుటుంబం: 8.9 బిలియన్ డాలర్లు➤విక్రమ్ లాల్ & కుటుంబం: 8.8 బిలియన్ డాలర్లు➤కులదీప్ సింగ్ & గుర్బచన్ సింగ్ ధింగ్రా: 7.5 బిలియన్ డాలర్లు➤రమేష్, రాజీవ్ జునేజా & కుటుంబం: 7 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?పైన వెల్లడించిన లిస్టులో ఉన్న ప్రముఖులు ఢిల్లీలో మాత్రమే కాదు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. వీరందరూ పారిశ్రామిక రంగంలో తమదైన ముద్రవేసి, ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2025 ఆగస్టులో ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు రూ. 5725 కోట్లు అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. దేశ ఆర్ధిక వృద్ధికి ఢిల్లీ ఎంత ముఖ్యమైన నగరమో అర్థం చేసుకోవచ్చు. -
ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎవరంటే.. అందరూ 'ఎలాన్ మస్క్' అని చెబుతారు. అయన ఏం చదువుకున్నారు అంటే మాత్రం.. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ప్రపంచంలోని ఐదుమంది అత్యంత ధనవంతులు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.ఎలాన్ మస్క్‌టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల సీఈఓ అయిన ఎలాన్ మస్క్.. తన ప్రాధమిక విద్యను దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని పాఠశాలల్లో పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ చదివారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో.. పీహెచ్డీ చేయడానికి చేరినప్పటికీ అది పూర్తి చేయలేదని సమాచారం.లారీ ఎల్లిసన్ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ ఈయనను అత్యంత తెలివైన వ్యక్తిగా ప్రశంసించారు. ఎల్లిసన్ చికాగో యూనివర్సిటీలో చదివారు, కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ తరువాత డిగ్రీ పూర్తి చేయడానికి 'ఇల్లినాయిస్ యూనివర్సిటీ అట్ అర్బనా-షాంపెయిన్'లో చేరారు. కానీ అదే సమయంలో ఆయన తల్లి మరణించడంతో.. డిగ్రీ పూర్తిచేయకుండా ఆపేశారు.మార్క్ జుకర్బర్గ్ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల సమ్మేళనమైన మెటాకు సీఈఓ అయిన.. మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ & సైకాలజీ చదివాడు. కానీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించిన తరువాత.. డిగ్రీ పూర్తి చేయలేదు.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికజెఫ్ బెజోస్వరల్డ్ టాప్ 10 కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్.. అమెజాన్ వ్యవస్థాపకులు. ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫిజిక్స్ చదవాలనుకున్నారు. కానీ కంప్యూటర్ల పట్ల తనకున్న ఆసక్తితో అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు.లారీ పేజ్గూగుల్ కో-ఫౌండర్ అయిన లారీ పేజ్.. ప్రపంచంలోనే ఐదవ ధనవంతుడు. ఈయన మిచిగాన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్టాన్ఫర్డ్లోని పీహెచ్డీ రీసెర్చ్ సమయంలోనే లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ కలిసి గూగుల్ సర్చ్ ఆల్గోరిథం అభివృద్ధి చేశారు. -
కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు: లిస్ట్ ఇదిగో..
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఒకటి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించి.. గత దశాబ్దంలో 93.6% వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ ధనవంతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ కథనంలో కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు ఎవరు?, వారి నికర విలువ (ఫోర్బ్స్ ప్రకారం) ఎంత అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు➤అజీమ్ ప్రేమ్‌జీ - విప్రో వ్యవస్థాపకులు: 11.7 బిలియన్ డాలర్లు➤నారాయణ మూర్తి - ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు: 4.4 బిలియన్ డాలర్లు➤ఇర్ఫాన్ రజాక్ - ప్రెస్టీజ్ గ్రూప్ : 1.7 బిలియన్ డాలర్లు➤కిరణ్ మజుందార్-షా - బయోకాన్ వ్యవస్థాపకులు: 3.4 బిలియన్ డాలర్లు➤నిఖిల్ కామత్ - జెరోధా & ట్రూ బీకాన్ సహవ్యవస్థాపకులు: 2.5 బిలియన్ డాలర్లు➤క్రిస్ గోపాలకృష్ణన్ - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3.5 బిలియన్ డాలర్లు➤రంజన్ పాయ్ - మణిపాల్ మెడికల్ & ఎడ్యుకేషన్ గ్రూప్: 2.8 బిలియన్ డాలర్లు➤రాజేష్ మెహతా - రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకులు: 1.57 బిలియన్ డాలర్లు➤నందన్ నీలేకని - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3 బిలియన్ డాలర్లు➤విజయ్ సంకేశ్వర్ - వీఆర్ఎల్ గ్రూప్ వ్యవస్థాపకులు: రూ. 10,000 కోట్లు కంటే ఎక్కువఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే? -
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్.. చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఎంతోమంది గొప్ప రాజకీయంగా నాయకులను అందించిన.. ఈ రాష్ట్రం దేశానికి కొంతమంది సంపన్న వ్యవస్థాపకులు కూడా అందించింది. ఈ కథనంలో యూపీలో అత్యంత ధనవంతులు, వారి నికర విలువ (అంచనా) గురించి తెలుసుకుందాం.➤మురళీధర్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 14,000 కోట్లు➤బిమల్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 9,000 కోట్లు➤విజయ్ శేఖర్ శర్మ - పేటీఎం: రూ. 8,000 కోట్లు➤దినేష్ చంద్ర అగర్వాల్ - ఇండియామార్ట్: రూ. 5,400 కోట్లు➤అలఖ్ పాండే - ఫిజిక్స్ వాలా: రూ. 4,500 కోట్లు➤ప్రదీప్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ. 4,400 కోట్లు➤చక్రేష్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ.4,400 కోట్లు➤యశ్వర్ధన్ అగర్వాల్ - ప్రియాగోల్డ్ బిస్కెట్స్: రూ. 4,200 కోట్లుఇదీ చదవండి: యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత -
ప్రపంచ టాప్ 20 ధనవంతుల జాబితాలో అంబానీ, అదానీకి చోటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో తన సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా ఉన్న ఈ సూచీలో ముఖేశ్ అంబానీ 17వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఇండెక్స్‌లో టాప్‌లో టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్, తర్వాతి స్థానాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ నిలిచారు.బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతులు జాబితాలో ఇండియా నుంచి ముఖేశ్ అంబానీ(17వ స్థానం), గౌతమ్ అదానీ(20వ స్థానం), శివ్‌నాడార్(41వ స్థానం), షాపూర్ మిస్త్రీ(52వ స్థానం), సావిత్రి జిందాల్(59వ స్థానం), అజిమ్‌ప్రేమ్‌జీ(69వ స్థానం), సునిల్మిట్టల్(73 స్థానం), దిలీప్ సంఘ్వీ(79వ స్థానం), లక్ష్మీ మిట్టల్(86వ స్థానం)లు 100 స్థానాల్లోపు నిలిచారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్’ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా.. -
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు
ప్రపంచంలో అత్యంత ధనవంతులు(Richest People)గా ఉన్నవారు తమ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తూంటారు. అందులో భాగంగా చాలామంది తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. అందుకు తమ విద్యాభ్యాసం ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచంలోని టాప్ ధనవంతుల విద్యార్హతలు(Educational Qualifications) తెలుసుకుందాం.ఎలాన్ మస్క్ నికర విలువ: 400 బిలియన్ డాలర్లు, కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఆర్ట్స్ ఇన్ ఫిజిక్స్, సైన్స్ ఇన్ ఎకనామిక్స్ విభాగంగా బ్యాచిలర్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో చేరిన కొన్ని రోజులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలిసి తన వ్యాపారాలు ప్రారంభించారు.జెఫ్ బెజోస్ నికర విలువ: 239.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు - అమెజాన్ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.మార్క్ జుకర్ బర్గ్ నికర విలువ: 211.8 బిలియన్ డాలర్లు, కంపెనీలు మెటా-ఫేస్బుక్హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ చదివారు.లారీ ఎల్లిసన్ నికర విలువ: 204.6 బిలియన్ డాలర్లు, కంపెనీలు-ఒరాకిల్యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఎట్ అర్బానా-చాంపైన్ నుంచి ప్రీ-మెడికల్ స్టూడెంట్‌గా చేరాడు. కానీ డిగ్రీ పూర్తి కాకముందే చదువు ఆపేశాడు. తర్వాత కొంత కాలానికి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు.బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ నికర విలువ: 181.3 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎల్వీఎంహెచ్-లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీఎకోల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.లారీ పేజ్ నికర విలువ: 161.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ పట్టా పొందారు.సెర్గీ బ్రిన్ నికర విలువ: 150 బిలియన్ డాలర్లు, కంపెనీలుయూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేశారు.వారెన్ బఫెట్ నికర విలువ: 146.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు బెర్క్‌షైర్ హాత్వేయూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..స్టీవ్ బామర్ నికర విలువ: 126 బిలియన్ డాలర్లు, కంపెనీలు మైక్రోసాఫ్ట్హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరారు. కానీ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడం వల్ల చదువు మధ్యలోనే ఆపేశారు.జెన్సెన్ హువాంగ్ నికర విలువ: 120.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎన్విడియాఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. -
సన్నబడ్డ సంపన్నులు! రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి!!
ప్రపంచంలో సంపన్నుల సంపద కరిగిపోయింది. ఒక్క జెఫ్ బెజోస్ నెట్‌వర్త్ శుక్రవారం 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపద 134 బిలియన్ డాలర్లు (రూ. 11 లక్షల కోట్లు) క్షీణించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ షేర్లు మార్కెట్లో విస్తృత అమ్మకాల మధ్య 8.8% పడిపోయాయి. బెజోస్ నెట్‌వర్త్ 191.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో భారీగా సంపద క్షీణించడం జెజోస్కి ఇది మూడోసారి. 2019లో విడాకుల పరిష్కారం తర్వాత 36 బిలియన్ డాలర్లు, 2022లో అమెజాన్ షేర్లు 14% పడిపోయాయి.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4% పడిపోయింది. ఇలాన్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్‌తో సహా ఇతర టెక్ బిలియనీర్ల సంపదలు వరుసగా 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలపై అనిశ్చితి, అలాగే కొన్ని అధిక-ప్రొఫైల్ ఆదాయాల్లో నిరాశలు, టెక్-హెవీ ఇండెక్స్‌ను దిద్దుబాటులోకి నెట్టేశాయి. కేవలం మూడు వారాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల విలువను తుడిచిపెట్టేసింది. -
ఈ ఏడాది ప్రపంచ కుబేరులు వీరే.. జాబితా ఇదే!
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో వ్యాపారవేత్తలు తమదైన రీతిలో బిజినెస్ చేస్తూ నువ్వా.. నేనా అన్నట్లు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 10 మంది జాబితా విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ కుబేరుడిగా మళ్ళీ టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) నిలిచాడు, ఆ తరువాత స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ, జెఫ్ బెజోస్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో స్టీవ్ బాల్మెర్ (మైక్రోసాఫ్ట్), సెర్గీ బ్రిన్ (గూగుల్) నిలిచారు. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితా ఇలాన్ మస్క్ (Elon Musk) - 227.8 బిలియన్ డాలర్స్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ - 179.3 బిలియన్ డాలర్స్ జెఫ్ బెజోస్ - 174.0 బిలియన్ డాలర్స్ లారీ ఎల్లిసన్ - 134.9 బిలియన్ డాలర్స్ మార్క్ జుకర్‌బర్గ్ - 130.2 బిలియన్ డాలర్స్ బిల్ గేట్స్ - 119.9 బిలియన్ డాలర్స్ వారెన్ బఫెట్ - 119.2 బిలియన్ డాలర్స్ లారీ పేజీ - 118.7 బిలియన్ డాలర్స్ స్టీవ్ బాల్మెర్ - 115.4 బిలియన్ డాలర్స్ సెర్గీ బ్రిన్ - 113.8 బిలియన్ డాలర్స్ -
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి విన్నారా!. దీన్ని ఎక్కువగా అత్యంత ధనవంతులే కోరుకుంటారట. ఈ పాస్‌పోర్ట్‌ని పొందడమే అదృష్టంగా భావిస్తారట వారు. అసలేంటి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్. ధనవంతులకు ఆ పాస్‌పోర్ట్ అంటే ఎందుకంతా క్రేజ్!. గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం పొందే పాస్‌పోర్ట్. గణనీయమైన ఆర్థిక పెట్టుబడుల ద్వారా వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు విదేశాల్లో నివాసం ఉండగలుగుతారు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని వీసా రహిత ప్రయాణం అనాలి. ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారాలను విస్తరించుకునేందుకు సులవైన మార్గం కూడా. ఈ పాస్‌పోర్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు.. గోల్డెన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అనేక దేశాలకు పాస్‌పోర్ట్ లేకుండా ఈజీగా రాకపోకలు సాగించగలరు. కొన్ని దేశాలు పన్ను భారాన్ని తగ్గించుకోవాలని చూసే వారికి అనూకూలమైన పన్ను విధానాలను అందించి మరీ పెట్టుబడులు పెట్టేలా చేసి మరీ ఈ వీసాలను ఇస్తాయట. ఇది కొత్త మార్కెట్లకి, పెట్టుబడి అవకాశాలకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ కారణంగా ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, నాణ్యమైన జీవన ప్రమాణాలను తదితరాలను పొందుతారు. ఇలాంటి పౌరసత్వాలను అందించే దేశాలు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఆంటిగ్వా మరియు బార్బుడా మరియు డొమినికా వంటి దేశాలు ఇలాంటి ఆకర్షణీయమైన పౌరసత్వ కార్యక్రమాలను అందిస్తున్నాయి. అలాగే మాల్టా, సైప్రస్ వంటి దేశాలు ఐరోపా చుట్టి వచ్చేలా, కొన్ని కరేబియన్ దేశాలు, వనాటు వంటివి యునైటెడ్ స్టేట్స్లో ఉండేలా ఆకర్షణీయమైన వీసాలను అందిస్తున్నాయి. చుట్టుమడుతున్న వివాదాలు గమ్యాన్ని బట్టి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్ వందల వేల నుంచి మిలియన్ల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ వీసా ఆర్థిక ప్రయోజనాలు, మెరగైన జీవనశైలికి ప్రధాన ఆకర్షణగా ఉన్నా.. ఆస్తుల దుర్వినియోగం జరిగే ప్రమాదం పొంచి ఉంది. అత్యంత ధనవంతులకు ఇదోక అవకాశంలా.. ఆస్తులను కాపాడుకునేందుకు సులభమైన మార్గంలా ఉండే ప్రమాదం ఉంది. అలాగే భద్రత, స్వేచ్ఛ పరంగా కూడా ఈ పాస్‌పోర్ట్ విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. (చదవండి: అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..) -
Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!
దావోస్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది. ‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచ్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది. కేంద్రానికి సూచనలు... ► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి. ► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి. ► ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి. ► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ► విద్యా రంగానికి బక్జెట్ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి. ► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి. నివేదిక విశేషాలు... ► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది. ► దేశంలో టాప్–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు! ► భారత్‌లోని టాప్ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది. ► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు. ► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది. ► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది. ► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్ ఇనీక్వాలిటీ అలియన్స్ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్ చేశారు. ► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు. 5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే... ► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు. ► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది! ► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!! ► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ► వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది. ► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది! ► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. -
పదో వంతు దేశ జీడీపీ వారి చేతుల్లోనే..
ముంబై: దేశంలోని 25మంది కుబేరులు పదోవంతు దేశ జీడీపీని కలిగి ఉన్నారని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు బుధవారం సంస్థ ప్రతినిధులు ఓ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు యాటిన్ షా స్పందిస్తూ.. సంపదలో ఎక్కువ భాగం వారసత్వంగా లభిస్తుందని పత్రిక ప్రకటనలో తెలిపారు. కాగా, భారత కుబేరులు 53 శాతం సంపదను వారసత్వంగా పొందినా, సంపద సృష్టిపై కూడా వారు దృష్టి పెట్టారని షా విశ్లేషించారు. హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఐదు ట్రిలియన్ డాలర్ల జీడీపీని లక్ష్యంగా పెట్టుకోవడంతో కుబేరుల సంపద మూడు రెట్లు పెరగనుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సంపద సృష్టి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువత అధికంగా ఉన్న భారత్‌లో సంపద సృష్టి జరిగే అవకాశం మెండుగా ఉందని, తద్వారా ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఐఐఎఫ్ఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
టాప్-10 కుబేరుల్లో జుకర్ బర్గ్
మార్కెట్ల పతనం, చమురు ధరలు పడిపోవడం ప్రపంచ ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపింది. చాలా మంది కుబేరుల సంపద విలువ గణనీయంగా తగ్గిపోయింది. ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 2009 నుంచి తొలిసారి 10 మంది స్థానం కోల్పోయారు. ఇక ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ సారి 221 మంది స్థానం కోల్పోగా, కొత్తగా 198 మంది ఇందులో చోటు దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. ప్రపంచ అత్యంత కుబేరుల తాజా జాబితాలో బిల్ గేట్స్ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద విలువ 5.08 లక్షల కోట్ల రూపాయలు. కాగా గతేడాదితో పోలిస్తే ఆయన సంపద విలువ దాదాపు 28 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది. యూరప్‌కు చెందిన జారా అమానికో ఓర్టెగా రెండో స్థానానికి దూసుకెళ్లారు. ఆయన ఈ స్థానానికి రావడం ఇదే మొదటి సారి. వారెన్ బఫెట్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంతకుముందు 2వ స్థానంలో ఉన్న మెక్సికో వాసి కార్లోస్ స్లిమ్ 4వ స్థానానికి పడిపోయారు. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ 16వ స్థానం నుంచి ఏకంగా 6వ స్థానానికి ఎదిగారు. జుకర్ బర్గ్‌తో పాటు అమేజాన్ సీఈవో జెఫ్ బిజోస్ తొలిసారి టాప్-10లో స్థానం సంపాదించారు. చైనాకు చెందిన వాంగ్ జియాన్లిన్ తొలిసారి టాప్-20లో చేరారు.