
ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరం. ఇది రాజకీయాలకు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రం కూడా. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఎక్కువ మంది ధనవంతులు నివసిస్తున్న నగరాల్లో కూడా ఢిల్లీ స్థానం సంపాదించుకుంది. ఈ కథనంలో ఢిల్లీలోని అత్యంత ధనవంతులు ఎవరు?, వారి నెట్‌వర్త్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.
➤శివ్ నాడార్: 40.2 బిలియన్ డాలర్లు
➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 30.7 బిలియన్ డాలర్లు
➤రవి జైపురియా: 17.3 బిలియన్ డాలర్లు
➤బర్మన్ కుటుంబం: 10.4 బిలియన్ డాలర్లు
➤కపిల్ & రాహుల్ భాటియా: 10.1 బిలియన్ డాలర్లు
➤వినోద్, అనిల్ రాయ్ గుప్తా & కుటుంబం: 9.5 బిలియన్ డాలర్లు
➤వివేక్ చాంద్ సెహగల్ & కుటుంబం: 8.9 బిలియన్ డాలర్లు
➤విక్రమ్ లాల్ & కుటుంబం: 8.8 బిలియన్ డాలర్లు
➤కులదీప్ సింగ్ & గుర్బచన్ సింగ్ ధింగ్రా: 7.5 బిలియన్ డాలర్లు
➤రమేష్, రాజీవ్ జునేజా & కుటుంబం: 7 బిలియన్ డాలర్లు
ఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?
పైన వెల్లడించిన లిస్టులో ఉన్న ప్రముఖులు ఢిల్లీలో మాత్రమే కాదు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. వీరందరూ పారిశ్రామిక రంగంలో తమదైన ముద్రవేసి, ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2025 ఆగస్టులో ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు రూ. 5725 కోట్లు అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. దేశ ఆర్ధిక వృద్ధికి ఢిల్లీ ఎంత ముఖ్యమైన నగరమో అర్థం చేసుకోవచ్చు.