
బిహార్ అంటే పేద రాష్ట్రం, నిరక్షరాస్యులు ఎక్కువ అనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంటుంది. కానీ బిహార్ (Bihar) సాంప్రదాయకంగా పండితులు, నాయకులు, సాంస్కృతిక గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా కూడా ఉంది.
మైనింగ్ నుండి ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ సర్వీసులు, పునరుత్పాదక ఇంధనం, రాజకీయాల వరకు వివిధ రంగాల్లో సంకల్పం, విజన్‌తో వేల కోట్ల సంపదను ఎలా సృష్టించగలరో బిహార్ సంపన్నులు (Richest People In Bihar) చూపిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. 2025లో బిహార్ లోని టాప్ 10 ధనవంతులు, వారి వ్యాపార సామ్రాజ్యాలు, నెట్‌వర్త్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అనిల్ అగర్వాల్
నెట్‌వర్త్: రూ.16,000–17,000 కోట్లు
బిజినెస్: వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు (మైనింగ్ & మెటల్స్)
నేపథ్యం: పాట్నాలో స్క్రాప్ డీలర్ గా ప్రారంభించిన అగర్వాల్ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వనరుల కంపెనీలలో ఒకదాన్ని నిర్మించారు. ఇప్పుడు లండన్ లో ప్రధాన కార్యాలయం ఉంది.
రవీంద్ర కిషోర్ సిన్హా
నెట్‌వర్త్: రూ.5,000–10,000 కోట్లు
బిజినెస్: SIS (సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్)
నేపథ్యం: భారతదేశపు అతిపెద్ద సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీని నిర్మించిన మాజీ జర్నలిస్ట్.
మహేంద్ర ప్రసాద్
నెట్‌వర్త్: రూ .4,000 కోట్లు పైనే
బిజినెస్: అరిస్టో ఫార్మాస్యూటికల్స్
నేపథ్యం: "కింగ్ మహేంద్ర"గా పిలువబడే ఈయనది బిహార్ ఫార్మా ఉనికిలో కీలక పాత్ర.
సంప్రదా సింగ్
నెట్‌వర్త్: (2019లో మరణించడానికి ముందు): రూ .25,000 కోట్లు పైనే
బిజినెస్: ఆల్కెమ్ లేబొరేటరీస్
నేపథ్యం: తన సోదరుడితో కలిసి ముంబైలో ఆల్కెమ్ ను స్థాపించి, దానిని ప్రముఖ ఫార్మా బ్రాండ్ గా తీర్చిదిద్దారు.
సుబ్రతా రాయ్
నెట్‌వర్త్: రూ .3,000 కోట్లు పైనే
బిజినెస్: సహారా ఇండియా (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా)
నేపథ్యం: 1978లో సహారాను కనీస మూలధనంతో స్థాపించి, దానిని జాతీయ సమ్మేళనంగా నిర్మించారు.
శుభమ్ సింగ్
నెట్‌వర్త్: రూ.500+ కోట్లు
బిజెనెస్: భారత్ ఊర్జా డిస్టిలరీస్ (ఇథనాల్ ప్లాంట్)
నేపథ్యం: కేవలం 26 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఇంధన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా బిహార్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని నడిపించారు.
సుభాష్ చంద్ర
నెట్‌వర్త్: రూ .5,000+ కోట్లు
బిజినెస్: ఎస్సెల్ గ్రూప్, జీ మీడియా
నేపథ్యం: భారతదేశపు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించారు. బీహార్ వెలుపల ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు బిహార్‌తో ముడిపడి ఉన్నాయి.
సుమంత్ సిన్హా
నెట్‌వర్త్: రూ .3,000+ కోట్లు
బిజినెస్: రెన్యూ పవర్
నేపథ్యం: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడైన సుమంత్ భారత క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రముఖ పేరు తెచ్చుకున్నారు.
ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్