అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్‌ | Madhya Pradesh BJP Leader Mid Night Dirty Picutre Viral | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్‌

May 24 2025 8:15 PM | Updated on May 24 2025 8:23 PM

Madhya Pradesh BJP Leader Mid Night Dirty Picutre Viral

అర్ధరాత్రి.. అదీ బిజీ రహదారిపై సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించాడో ఒక్కడో రాజకీయ నేత. ఓ మహిళతో అభ్యంతకర రీతిలో కనిపించి చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం అతగాడి డర్టీ పిక్చర్‌(Dirty Picture) వ్యవహారం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మంద్సౌర్‌ జిల్లా బని గ్రామానికి బీజేపీ నేత మనోహర్‌లాల్‌ ధాకడ్‌(Manoharlal Dhakad) తీరుపై ఇటు రాజకీయ వర్గాలు, అటు సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఆదమరిచి ఓ మహిళతో శృంగారం చేశాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో అందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా, ఆ విజువల్స్‌ బయటకు వచ్చాయి. 

అందులోని దృశ్యాల ప్రకారం.. తొలుత ఓ వైట్‌ కలర్‌ కార్‌ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన వచ్చి ఆగింది. అందులోంచి నగ్నంగా ఉన్న ఓ మహిళ కిందకు దిగింది. ఆపై కిందకు దిగిన మనోహర్‌లాల్‌ ఆమెతో అభ్యంతరకర భంగిమలో రెచ్చిపోయాడు. మే  13వ తేదీ  అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. ఆ దృశ్యాలు వైరల్‌ కావడంతో మనోహర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మనోహర్‌ బీజేపీ లోకల్‌ లీడర్‌ కాగా, ఆయన భార్య మంద్సౌర్‌ జిల్లా పంచాయితీ సభ్యురాలు.

ఈ గలీజు వీడియోపై ఆయన స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై జిల్లా బీజేపీ చీఫ్‌ రాజేష్‌ దీక్షిత్‌ స్పందించారు. మనోహర్‌లాల్‌కు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదని, ఆయన కేవలం ఆన్‌లైన్‌ సభ్యుడు మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేత ఒకరు స్పందించారు. ఇలాంటి వాళ్లకు పార్టీలో ఎట్టిపరిస్థితుల్లో చోటు ఉండబోదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement