
ధార్: ‘ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.
తన 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు ‘రిటర్న్ గిఫ్ట్’ను అందజేశారు. ధార్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పార్క్ మూడు లక్షల మందికి ఉపాధి అందించనుంది. అలిగే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధార్ చేరుకున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు స్వాగతించారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రధాని మోదీని సాంప్రదాయ తలపాగా, శాలువా లతో సత్కరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు.
प्रधानमंत्री श्री @narendramodi मध्य प्रदेश के धार में 'स्वस्थ नारी सशक्त परिवार' और 'आठवें राष्ट्रीय पोषण माह' अभियान का शुभारंभ कर रहे हैं। #SevaParv https://t.co/CFjDWloZLB
— BJP (@BJP4India) September 17, 2025
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల ధైర్యం, పరాక్రమాలను ప్రశంసించారు. ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుందని పాక్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రజల శక్తి, కృషి సహకారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం భారతదేశాన్ని మార్చివేసిందని, పీఎం మిత్రా పార్క్ ద్వారా నిమార్ మాల్వా ప్రాంతంలో ఒక ప్రధాన మార్కెట్ ఏర్పడబోతున్నదని దీనికి ఈరోజు పునాది రాయి పడిందని అన్నారు.
