50 ఏళ్లుగా అస్సలు నిద్రపోని వ్యక్తి.. వైద్యులకే షాక్‌! | Madhya Pradesh Man Claims He Hasnt Slept In 50 Years Doctors Puzzled | Sakshi
Sakshi News home page

50 ఏళ్లుగా అస్సలు నిద్రపోని వ్యక్తి.. వైద్యులకే షాక్‌!

Jan 17 2026 5:43 AM | Updated on Jan 17 2026 5:53 AM

Madhya Pradesh Man Claims He Hasnt Slept In 50 Years Doctors Puzzled

మనిషి నిద్ర లేకుండా జీవించడం సాధ్యం కాదని అంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నిద్ర చాలా ముఖ్యమైనది. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి గత 50 ఏళ్లుగా అస్సలు నిద్రపోలేదు. అయినా అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉండటం వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

రేవాకు చెందిన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ మోహన్ లాల్ ద్వివేది వయస్సు 75 సంవత్సరాలు. ఎమర్జెన్సీ సమయంలో తాను చివరిసారిగా నిద్రపోయానని, ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు అస్సలు నిద్రపోలేదనని మోహన్ లాల్ చెప్పారు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నిద్రపోకపోయినా మోహన్ లాల్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. అలసట లేదు, బలహీనత లేదు, కండరాల నొప్పి లేదు. ‘నాకు నిద్ర పట్టడం లేదు. నేను రాత్రిపూట పడుకుంటాను, కానీ నిద్రపోలేను. దీంతో పుస్తకాలు చదువుతాను.  వాకింగ్‌కు వెళ్తాను. ఇప్పుడది రొటీన్ గా మారింది’ మోహన్ లాల్ ద్వివేది చెబుతున్నారు.

మోహన్ లాల్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆయన పని చేసే శైలి కూడా  చర్చనీయాంశంగా ఉండేది. మోహన్ లాల్ అనేక గంటలు నిరంతరాయంగా పనిచేసేవారు. దీంతో ఆయన సబార్డినేట్ సిబ్బంది మోహన్ లాల్‌తో కలిసి పనిచేయాలంటే వామ్మో అనేవారు. బన్సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ సమయంలో ఆయన చాలా కిలోమీటర్లు నడిచేవారు. అయినా అలసటగా అనిపింపేది కాదట.

తన నిద్రలేమి సమస్య గురించి ముంబై, ఢిల్లీలోని పెద్ద వైద్యులను కూడా మోహన్ లాల్‌ సంప్రదించారు. అయినా ఫలితం కనిపించలేదు. యోగా, ప్రాణాయామం నుంచి భూతవైద్యం వరకు ప్రతిదీ ప్రయత్నించానని, కానీ ఇప్పటికీ నిద్ర రావడం లేదని మోహన్ లాల్ పేర్కొన్నారు. ఈ సమస్యపై మొదట్లో ఆందోళన పడ్డా ఇప్పుడు అలవాటు అయిపోయిందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement