
సింగ్రౌలి: కుర్కురే (Kurkure) కొని ఇవ్వలేదని ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలోని ఖుతార్ అవుట్ పోస్ట్ పరిధి ‘చితర్వాయి కలా’ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుర్కురే కొనివ్వమని 20 రూపాయలు అడిగినందుకు తన తల్లి, సోదరి తాడుతో కట్టి మరి కొట్టారంటూ పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ 112కి ఫోన్ చేసి మరి ఆ కుర్రాడు ఫిర్యాదు చేశాడు.
బాలుడు, పోలీసులు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ కుర్రాడు ఏడవడం మొదలుపెట్టాడు. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది త్వరలోనే తాము వస్తామంటూ ఆ బాలుడిని ప్రేమతో ఓదార్చడమే కాకుండా.. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లారు. కుర్రాడిని, అతని తల్లిని పిలిచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లాడిని కొట్టొదని తల్లికి చెబుతూ ఆ పిల్లాడికి కుర్కురే ప్యాకెట్లు కూడా కొని తెచ్చివడం విశేషం. ఈ వీడియో సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చివరికి ఆ కుర్రవాడి డిమాండ్ నెరవేరిందంటూ పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
बच्चे ने कुरकुरे की माँग की तो माँ ने कूट दिया। शिकायत पुलिस के पास पहुँची और माँग पूरी हो गई। वायरल वीडियो मध्य प्रदेश के सिंगरौली का है। pic.twitter.com/MqIcRKBB0w
— SANJAY TRIPATHI (@sanjayjourno) October 4, 2025