వెరీ సారీ... వారి దారి రహదారి కానే కాదు! | Handpump Stands in the Middle of Newly Built PMGSY... | Sakshi
Sakshi News home page

వెరీ సారీ... వారి దారి రహదారి కానే కాదు!

Oct 31 2025 10:15 AM | Updated on Oct 31 2025 11:04 AM

Handpump Stands in the Middle of Newly Built PMGSY...

అనగనగా దోల్‌ కోతర్‌ అనే గ్రామం ఉంది. మధ్యప్రదేశ్‌ సిది జిల్లాలోని ఈ గ్రామం సామాజిక మాధ్యమాలలో నవ్వులు పూయించడమే కాదు కోపంతో భగ్గుమనేలా చేస్తోంది. ఇంతకీ ఆ ఊళ్లో ఏం జరిగింది?

ప్రధాన్‌మంత్రీ గ్రామ్‌ సడక్‌ యోజన ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామంలో కొత్తగా ఒక రోడ్డు నిర్మించాలనుకున్నారు. దారి మధ్యలో చేతి పంపు ఉంది. గ్రామ నీటి అవసరాలకు ఇదే ఆధారం.చేతి పంపును తీసేసి రోడ్డు నిర్మించడం సరికాదు అనుకున్న కాంట్రాక్టర్, ప్రత్యేక నిర్మాణంతో పంప్‌ను అలాగే ఉంచి, కొత్త రోడ్డు నిర్మించాడు.

అయితే కథ సుఖాంతం కాలేదు. కాస్త సరదాగా చె΄్పాలంటే దుఃఖాంతం అయింది! గోతిలో హ్యాండ్‌ పంప్‌ ఉందని తెలియని వాహనదారులు అందులో పడి΄ోయి గాయాల ΄ాలవుతున్నారు. పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ అందులో పడి΄ోతున్నారు.

‘ఇదెక్కడి పంప్‌ రా బాబూ’ అని గ్రామ ప్రజలు నెత్తి, నోరు బాదుకుంటున్నారు. ఈ రోడ్డు పంప్‌ వ్యవహారం ఊరు దాటి, జిల్లా దాటి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. సురక్షితమైన మరో చోట హ్యాండ్‌ పంప్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నెటిజనులు మాత్రం ‘రోడ్డు మధ్యలో ఉన్న దేశంలోని తొలి హ్యాండ్‌పంప్‌’ అని కామెంట్స్‌ పెడుతున్నారు! 

(చదవండి: ధనాధన్‌..వాకథాన్‌..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement