ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన నిందితుడు అఖిల్ అలియాస్ నైట్రా నేర చరిత్రకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇండోర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ రౌడీగా పోలీసులు గుర్తించారు. ప్రపంచ కప్ మ్యాచ్ కోసం ఇండోర్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్‌కు సమీపంలో ఉన్న ఒక కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఆ సమయంలో అఖిల్ తన బైక్‌పై క్రికెటర్ల వద్దకు వచ్చి, వారిలో ఒకరిని లాగడానికి ప్రయత్నించి, ఆ తర్వాత వేగంగా వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మరో క్రికెటర్‌ను అసభ్యంగా తాకి పారిపోయాడు. భయపడిన క్రీడాకారులు వెంటనే తమ భద్రతాధికారికి తెలిపారు. ఆస్ట్రేలియా జట్టు సెక్యూరిటీ ఇన్‌ఛార్జి డ్యానీ సిమన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అఖిల్‌పై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతడి నేర చరిత్రలో దోపిడీ, దారి దోపిడీ, దొంగతనం, హత్యాయత్నం, బెదిరింపులు, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ మద్యం వ్యాపారం వంటి కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజేష్ దండోతియా మాట్లాడుతూ, అఖిల్‌కు నేర చరిత్ర ఉందని.. అతను చాలాసార్లు జైలుకెళ్లి.. బెయిల్, పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడల్లా కొత్త నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. సుమారు ఏడాది క్రితం, అఖిల్ కత్తితో ఒక యువ జంటపై దాడి చేసి, ఆ మహిళను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. మరో కేసులో, అతను ఉజ్జయినిలో పోలీసుల వద్ద నుంచి రైఫిల్స్‌ను లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని.. జైలు శిక్ష పూర్తయ్యాక అతను ఇటీవలనే ఇండోర్‌కు తిరిగి వచ్చాడని తెలిపారు.
ఈ ఘటనపై బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించిన సంగతిత తెలిసిందే. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవరిపట్ల కూడా ఇలా ప్రవర్తించకూడదు. ఆసీస్ క్రికెటర్లకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నామని పేర్కొంది


