
ట్రాన్స్‌జెండర్‌లా జీవిస్తున్న బంగ్లాదేశీ అరెస్ట్
భోపాల్: బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల పర్వంలో ఒకరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌చేశారు. 28 ఏళ్లుగా భారత్‌లో అక్రమంగా ఉంటున్న అబ్దుల్ కలామ్ అనే వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ బంగ్లాదేశ్ నుంచి పదేళ్ల వయసులో భారత్‌కు అక్రమంగా వచ్చి ముంబైలో 20 ఏళ్లపాటు నివసించాడు. ఎనిమిదేళ్లుగా నేహా కినార్ పేరిట ట్రాన్స్‌జెండర్‌గా మారువేషంలో భోపాల్ నగరంలో జీవిస్తున్నాడు.
ఈ 28 ఏళ్ల కాలంలో భారత్‌లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఓటర్ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ చివరకు భారత పాస్‌పోర్ట్ సైతం సంపాదించాడు. పలుమార్లు స్వదేశానికి వెళ్లి వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌లోకి అక్రమ మార్గాల్లో చేరుకున్నాక మారువేషాల్లో పలువురు జీవిస్తున్నారన్న సమాచారంతో భోపాల్ పోలీసులు నిఘా బృందాలు సమిష్టిగా దర్యాప్తుచేసి అబ్దుల్‌ను ఎట్టకేలకు అరెస్ట్‌చేశారు. దీంతో ఇలా ఎంత మంది బంగ్లాదేశీయులు మారువేషాల్లో భారత్‌లో నివసిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.