
దాతియా: కలెక్టర్ అనగానే ఎవరికైనా హుందాగా ఉండే ఒక రూపం గుర్తుకువస్తుంది. ఉన్నత పదవిలో ఉన్న అతనితో మాట్లాడాలంటే కాస్త భయమేస్తుంది. అయితే అలాంటి కలెక్టర్ చిన్నారులతో కలసిపోయి, వారు చెప్పేది శ్రద్ధగా వింటూ, వారి సందేహాలకు సమాధానాలిస్తుంటే ఎవరికైనా చూడముచ్చటేస్తుంది. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, తెగ లైక్‌లు, షేర్‌లు దక్కించుకుంటోంది.
This should go viral. ❤️
Swapnil Wankhede a 2016 batch IAS officer currently posted as Collector and District Magistrate of Datia district in Madhya Pradesh.
This video of his interacting with a small orphaned girl wins hearts. 1/n pic.twitter.com/SSteJkBReG— Gabbar (@Gabbar0099) September 15, 2025
2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ వాంఖడే ఒక అనాథ బాలికతో ప్రేమతో హృదయపూర్వకంగా సంభాషిస్తున్న వీడియో అందరి హృదయాలను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో వాంఖడే ఆ బాలికతో మాట్లాడుతున్నప్పుడు.. ఆమెకు కనిపించేలా వంగి ఉండటం, శ్రద్ధగా మాటలను వింటూ, ఆమె ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు వందలాది లైక్‌లు,షేర్‌లు దక్కుతున్నాయి. ఈ వీడియోను చూసివవారు వాంఖడే తీరును ప్రశంసిస్తున్నారు. మానవతా పాలన అంటే ఇదేనని ఒకరు వ్యాఖ్యానించగా, మరికొందరు ఆ చిన్నారి అభివృద్ధికి ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. మరికొందరు కలెక్టర్ అంటే ఇలా ఉండాలని అంటున్నారు.