
భోపాల్: అతడో విద్యార్థి.. టీచర్స్ చెప్పే పాఠాలు బుద్దిగా వినాల్సింది పోయి.. అనుచితంగా ప్రవర్తించాడు. సదరు మహిళా టీచర్‌ను విద్యార్థి వేధింపులకు గురి చేశాడు. తన ప్రేమను కాదన్నందుకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నర్సింగ్‌పూర్ జిల్లాలోని ఎక్సలెన్స్ స్కూల్‌లో నిందితుడిని సూర్యవంశ్ కొచార్(18) చదువుకుంటున్నాడు. అదే పాఠశాలలో బాధిత యువతి(26) గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సదరు టీచర్‌పై సూర్యవంశ్ ప్రేమ పెంచుకున్నాడు. అయితే, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఆ వేడుకలకు బాధిత టీచర్ చీర కట్టుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా టీచర్ చీరపై సూర్యవంశ్ అసభ్యకరమైన కామెంట్లు చేశాడని సమాచారం. దీంతో, ఈ అంశంపై టీచర్ ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ ఫిర్యాదుతో స్కూలు యాజమాన్యం సూర్యవంశ్‌పై చర్యలు తీసుకుంది.
A Class 12 student has been arrested on charges that he set on fire a 25-year-old female teacher who had filed a harassment complaint against him in Madhya Pradesh’s Narsinghpur district, police said.#MadhyaPradesh #Narsinghpur #CrimeNews #TeacherSafety #ViolenceAgainstWomen pic.twitter.com/QOY4x8gMdD
— UiTV Connect (@UiTV_Connect) August 20, 2025
ఈ క్రమంలో టీచర్‌పై పగ పట్టిన అతను పెట్రోల్ దాడికి ప్లాన్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం టీచర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న టీచర్ ను పిలిచి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై చల్లి, నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలికి 10 నుంచి 15 శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయమేమీ లేదని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు.. సూర్యవంశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థిపై 124ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసి మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.