ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి | 9 Killed And 2 Injured In Madhya Pradesh Jhabua Cement Truck Accident Details | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Jun 4 2025 10:21 AM | Updated on Jun 4 2025 1:51 PM

Madhya Pradesh Jhabua Cement Truck Accident Details

క్రైమ్‌: శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా.. ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి అనూహ్యంగా వాళ్లు ప్రయాణిస్తున్న వ్యాన్‌ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌ ఝుబువా(Jhabua) జిల్లా మేఘ్‌నగర్‌లో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. సిమెంట్‌ బస్తాల లోడ్‌ తీసుకెళ్లే ట్రక్కు ఒకటి.. సంజేలి రైల్వే క్రాసింగ్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి దాటుతుండగా అదుపు తప్పింది. పక్కన వెళ్తున్న ఓ వ్యాన్‌ మీద ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ఉన్న తొమ్మిది మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని, ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్పీ పద్మవిలోచన్‌ శుక్లా వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement