అవలీలగా గుర్రాన్ని నోటకరుచుకుని ఈడ్చుకెళ్లిన పెద్ద పులి.. వీడియో వైరల్! | Tiger Drags Horse Away In Front Of Tourists | Sakshi
Sakshi News home page

అవలీలగా గుర్రాన్ని నోటకరుచుకుని ఈడ్చుకెళ్లిన పెద్ద పులి.. వీడియో వైరల్!

Aug 19 2026 7:50 PM | Updated on Aug 19 2026 8:01 PM

Tiger Drags Horse Away In Front Of Tourists

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన రామ్‌నగర్ ప్రాంతం గర్జియాలో దారుణం జరిగింది. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ వెలుపల బెంగాల్‌ టైగర్‌.. గుర్రంపై దాడి చేసింది. ఆపై గుర్రాన్ని పులి తన నోట కరుచుకొని వెళ్లింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బెంగాల్ పులి ఆ గుర్రం గొంతును తన బలమైన దవడలతో గట్టిగా పట్టుకుని ఈడ్చుకుని వెళ్తుండటాన్ని గమనించవచ్చు. పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకు ఆ దృశ్యాల్ని  చిత్రీకరించారు.

ఈ దాడి జరిగిన గర్జియా జోన్ పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం.ఇక్కడే ప్రముఖ ‘గర్జియా దేవి ఆలయం’ కూడా ఉండటంతో నిరంతరం భక్తులు, పర్యాటకులు,వాహనాల రాకపోకలు ఉంటాయి. సాధారణంగా జనాభా సంచారం ఉండే ఇటువంటి కూడలి వద్ద పులి బహిరంగంగా వేటాడటం పర్యాటకుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటన జరిగిన రామ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో అటవీ శాఖ అధికారులు నిఘాను, గస్తీని ముమ్మరం చేశారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు ఎవరూ అడవి వైపు లేదా సమీపంలోని జూలా పుల్ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లవద్దని,అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, భారత్‌లో ఏ ఇతర టైగర్ రిజర్వ్‌లో లేని విధంగా ఒక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోనే అత్యధికంగా 260కి పైగా బెంగాల్ పులులు ఉన్నట్లు అంచనా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement