మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
షాజపూర్: సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్, మతమార్పిడులనే విష విలయాన్ని ప్రారంభించింది ఆయనే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇందర్ సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. బ్రిటిషర్లు మతమార్పిడులను ప్రోత్సహించిన వారికి మాత్రమే అండగా ఉంటూ, ఇతరులను నకిలీ సంఘ సంస్కర్తలుగా తూలనాడేవారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇటీవల బెంగాల్‌కు చెందిన రవీంద్రనాథ్ ఠాకూర్, బంకించంద్ర ఛటర్జీల గురించి బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధంకొనసాగుతున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనిపై బెంగాల్ మంత్రి శశి పాంజా తీవ్రంగా స్పందించారు.
‘బెంగాల్ ప్రముఖులను తక్కువగా చూపేందుకు బీజేపీ ప్రయతి్నస్తోందనేందుకు ఇది తాజా ఉదాహరణ. సతీ సహగమన దురాచారాన్ని అరికట్టింది రామ్మోహన్ రాయ్ అన్న విషయం అందరికీ తెల్సిందే. బీజేపీ తన కాలిని తానే నరుక్కుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, బెంగాల్‌ను మాత్రం చులకన చేయవద్దు’అని ఆయన హెచ్చరించారు. పర్మార్ వ్యా ఖ్యలు సిగ్గుచేటని ఎన్‌ఎస్‌యూఐ జాతీ య ప్రతినిధి విరాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విమర్శలతో పర్మార్ వెనక్కితగ్గారు. ‘రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త. మనమంతా ఆయన్ను గౌరవించాలి. తెలియక పొరపాటున అలా మాట్లాడాను. క్షమాపణ కోరుతున్నా’అని చెప్పారు.


