శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు భగవద్గీత తరగతులు
భోపాల్: పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్న వారందరికీ భగవద్గీత తరగతులు నిర్వహించాలని మధ్యప్రదేశ్ పోలీసుల శిక్షణ విభాగం నిర్ణయించింది. ఇది వారు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఎనిమిది శిక్షణ పాఠశాలల సూపరింటెండెంట్లకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శిక్షణ) రాజా బాబు సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో దాదాపు 4,000 మంది యువతీ యువకులు తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్నారు, ఇది గత జూలైలో ప్రారంభమైంది.
The saffronisation (भगवाकरण) of Madhya Pradesh police.
These young recruits have a mandatory training which involves recitation of Hindu verses.... Although had it been that they are trained to practice all the religions it wouldn't have been a problem.
Now imagine a hardcore… pic.twitter.com/rZ27N4yyse— Vishnukant Tiwari (@vishnukant_7) November 7, 2025
రామచరితమానస్ పఠనం
ఐపీఎస్ అధికారి సింగ్, ఈ శిక్షణ తరగతులను జూలైలో ప్రారంభించినప్పుడే.. రామచరితమానస్ పఠనానికి కూడా ఆదేశించారు. ఇది వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని అప్పుడే ఆయన స్పష్టం చేశారు. తాజాగా, శిక్షణ పాఠశాలల డైరెక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సాధ్యమైతే, శ్రీకృష్ణుడి పవిత్ర మాసమైన మార్గశిరంలో శిక్షణలో భాగంగా... కనీసం భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాలని సూచించారు. కాగా, ఈ అధికారి గతంలో 2019 ప్రాంతంలో గ్వాలియర్ రేంజ్ పోలీసు అధిపతిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించి, స్థానిక జైలు ఖైదీలు, ఇతరులకు భగవద్గీత ప్రతులను పంపిణీ చేశారు.


