అందంలోనే కాదు.. చ‌దువులోనూ అదుర్స్‌ | World's Youngest CA Nandini Agrawal Inspirational Journey | Sakshi
Sakshi News home page

Nandini Agrawal: అందంలోనే కాదు.. చ‌దువులోనూ ఫ‌స్ట్‌

Apr 29 2025 6:01 PM | Updated on Apr 29 2025 6:43 PM

World's Youngest CA Nandini Agrawal Inspirational Journey

చార్టర్డ్ అకౌంటెంట్ అవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. దేశంలోనే అత్యంత క్లిష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో ఒక‌టైన సీఏ ఎగ్జామ్‌లో పాస‌వ‌డం కోసం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప్రిపేర్ అవుతుంటారు. సీఏ ప‌రీక్ష‌ల్లో నెగ్గేందుకు ఏళ్ల‌బ‌డి పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టేవారెంద‌రినో మ‌నం చూసుంటాం. అయితే నందిని అగ‌ర్వాల్ అలా  కాదు. అత్యంత చిన్న‌వ‌య‌సులోనే సీఏ ఫైనల్స్‌ క్లియ‌ర్ చేయ‌డ‌మే కాదు, ఏకంగా ఆలిండియా టాప‌ర్‌గా నిలిచి ప్ర‌పంచ రికార్డు సాధించింది. ఇది జ‌రిగి నాలుగేళ్ల‌యింది. తాను ఎంచుకున్న రంగంలోనే కెరీర్ కొనసాగిస్తూ డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్‌గానూ రాణిస్తోంది నందిని.

అన్న‌య్యకు క్లాస్‌మేట్‌!
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మొరెనా ప‌ట్ట‌ణానికి చెందిన నందిని అగ‌ర్వాల్ (Nandini Agrawal) యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా 2021లో గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆ ఏడాది జూలై జ‌రిగిన సీఏ (న్యూ) ప‌రీక్ష‌ల్లో ఫ‌స్ట్ ర్యాంక్‌తో ఆలిండియా టాప‌ర్‌గా నిలిచింది. 19 ఏళ్ల 8 నెల‌ల 18 రోజుల వ‌య‌సులో ఆమె ఈ ఘ‌న‌త సాధించిన‌ట్టు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌ వెల్ల‌డించింది. 2001, అక్టోబ‌ర్ 18న నందిని జ‌న్మించింది. చ‌దువులో ఎంతో  చురుగ్గా ఉండే నందిని.. రెండు క్లాసులు జంప్ చేసి త‌న అన్న‌య్య స‌చిన్‌కు క్లాస్‌మేట్‌గా మారింది. చెల్లెలితో పాటు సీఏ ఫైనల్స్‌ రాసిన స‌చిన్‌కు 18వ ర్యాంక్ రావ‌డం గ‌మ‌నార్హం. ఇక సీఏ ఇంట‌ర్‌ను 16 ఏళ్ల వ‌య‌సులో పూర్తి చేసింది నందిని. ఆలిండియా 31వ ర్యాంక్ సాధించి స‌త్తా చాటింది.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ కంపెనీల్లో జాబ్‌
నందిని ప్ర‌స్తుతం ప్రైవేటు ఈక్విటీ ఎన‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. అంత‌కుముందు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ కార్పొరేట్ కంపెనీల్లో ప‌నిచేశారు. పీడ‌బ్ల్యూసీ కంపెనీలో ఆర్టిక‌ల్ ట్రైయినీగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్ గాళ్ అంచెలంచెలుగా ఎదిగారు. స్టాట్యూటరీ ఆడిట్‌, గ్రూప్ రిపోర్టింగ్, రెఫర్డ్ రిపోర్టింగ్, IFRS అసైన్‌మెంట్‌లు, టాక్స్ ఆడిట్‌, ఫోరెన్సిక్ ఆడిట్‌లలో త‌న‌కు మూడేళ్ల‌ అనుభవం ఉందని త‌న లింక్డ్‌ఇన్ బయోలో రాసుకున్నారు నందిని. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో ఒకటిన్నర సంవత్సరాలు అసోసియేట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేసిన‌ట్టు వెల్ల‌డించారు. BCGలో కీల‌క‌మైన‌ G20 టీమ్‌లోనూ ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

చ‌ద‌వండి: క‌ళ్ల త‌ప్పిన బైండ్ల బ‌తుకులు

సోష‌ల్ మీడియాలోనూ సంచ‌ల‌నం
డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్‌గా త‌న‌దైన స్ట‌యిల్‌లో దూసుకెళుతోంది నందిని అగ‌ర్వాల్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 74 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లోనూ ఆమెకు 2 ల‌క్ష‌ల‌కు పైగా స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. సీఏ ఎగ్జామ్స్ ప‌రీక్ష‌ల సంబంధించిన స్ట‌డీ టిప్స్ వీడియోల‌ను యూట్యూబ్‌లో ఆమె షేర్ చేస్తుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement