
రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 కోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ శర్మ స్ధానంలో రజత్ పాటిదార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 32 ఏళ్ల పాటిదార్ గతంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టకు నాయకత్వం వహించడానికి నిరాకరించాడు.
కానీ ఇప్పుడు ఎంపీసీఎ పెద్దల సూచన మేరకు రజత్ తన మనసును నిర్ణయించుకున్నాడు. పాటిదార్ కెప్టెన్‌గా ప్రస్తుతం విజయపథంలో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఐపీఎల్ టైటిల్‌ను పాటిదార్ అందించాడు.
అదేవిధంగా అతడి సారథ్యంలోనే సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ-2025 టైటిల్‌ను సొంతం చేసుకుంది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT)-2025, విజయ్ హజారే ట్రోఫీ (VHT) లలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా పాటిదార్ వ్యవహరించాడు. ఇక రాబోయే రంజీ సీజన్‌కు స్టార్ పేసర్ అవేష్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.
అవేష్ జూన్ 17న ముంబైలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడు తన గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు రంజీ ట్రోఫీ సెకెండ్ లెగ్ సమయానికి అందబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
రంజీ ట్రోఫీకి మధ్యప్రదేశ్ జట్టు ఇదే..
రజత్ పాటిదార్ (కెప్టెన్), యష్ దూబే, హర్ష్ గావ్లీ, శుభమ్ శర్మ, హిమాన్షు మంత్రి, హర్‌ప్రీత్ సింగ్, వెంకటేష్ అయ్యర్, సాగర్ సోలంకి, కుమార్ కార్తికే, సరాంశ్ జైన్, అధీర్ ప్రతాప్, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, అనుభవ్ అగర్వాల్, కుల్దీప్ సేన్
చదవండి: ఆ పాక్ ఆటగాడికి థ్యాంక్స్.. అతడి వల్లే గెలిచాము: అశ్విన్