
అక్టోబర్ 12 నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాతో జరుగబోయే (Pakistan vs South Africa) రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును (Pakistan) ఇవాళ (సెప్టెంబర్ 30) ప్రకటించారు.
కెప్టెన్‌గా షాన్ మసూద్ (Shan Masood) కొనసాగనుండగా.. ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు (ఆసిఫ్ అఫ్రిది (ఎడమ చేతి ఆర్తోడాక్స్ స్పిన్నర్), ఫైసల్ అక్రమ్ (ఎడమచేతి చైనామాన్ బౌలర్), రోహైల్ నజీర్ (వికెట్ కీపర్-బ్యాటర్)) జట్టులో చోటు దక్కించుకున్నారు. చెత్త రికార్డు (12 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు) ఉన్నప్పటికీ.. షాన్ మసూద్‌ను కెప్టెన్‌గా కొనసాగించడం విశేషం.
మసూద్‌తో పాటు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్-3లో ఉండగా... బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, కమ్రాన్ గులామ్, టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా, సౌద్ షకీల్, రోహైల్ నజీర్ మిడిలార్డర్‌లో చోటు దక్కించుకున్నారు.
బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను (నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ అఫ్రిది, ఫైసల్ అక్రమ్) ఎంపిక చేశారు. పేస్ బౌలింగ్ విభాగానికి షాహీన్ అఫ్రిది నాయకత్వం వహిస్తుండగా.. ఆమిర్ జమాల్, హసల్ అలీ, ఖుర్రమ్ షెహజాద్ ఇతర సభ్యులుగా ఉన్నారు.
2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ను సౌతాఫ్రికా ఈ సిరీస్‌తోనే ప్రారంభించనుంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో పాక్‌కు కూడా ఇదే తొలి పరీక్ష. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ అక్టోబర్ 12 నుంచి లాహోర్‌లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో ప్రారంభమవుతాయి.
గత డబ్ల్యూటీసీలో పాకిస్తాన్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.
పాక్ పర్యటనలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు కూడా ఆడనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్లను ఇదివరకే ప్రకటించగా.. పాక్ జట్లకు ప్రకటించాల్సి ఉంది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు:
షాన్ మసూద్ (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ ఆఫ్రిది, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మహ్మద్ రిజ్వాన్ (wk), నౌమాన్ అలీ, రోహైల్ నజీర్ (wk), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిది
పాకిస్తాన్‌తో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా జట్టు:
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హమ్జా, టోనీ డి జోర్జీ, సెనురన్ ముత్తాస్వామి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో జన్సెన్, ప్రెనెలన్ సుబ్రాయన్, డేవిడ్ బెడింగ్హమ్, కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, సైమన్ హార్మర్, కగిసో రబాడ
చదవండి: చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా