‘లవ్ జిహాద్’పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు | BJP MLA Usha Thakur calls for harsh punishment for love jihad | Sakshi
Sakshi News home page

‘లవ్ జిహాద్’పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

May 29 2025 9:27 PM | Updated on May 29 2025 9:32 PM

BJP MLA Usha Thakur calls for harsh punishment for love jihad

భోపాల్‌: ‘లవ్ జిహాద్’పై మధ్యప్రదేశ్‌ మాజీ సంస్కృతి మంత్రి,బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.ఇండోర్, భోపాల్‌లో లవ్ జిహాద్ కేసుల గురించి ఎమ్మెల్ ఉషా ఠాకూర్ మీడియాతో మాట్లాడారు.

లవ్‌ జీహాద్‌ పేరుతో మానవత్వాన్ని, నైతిక విలువలను భగ్నం చేసే నేరస్తులకు షరియా చట్ట ప్రకారం శిక్షించాలని పిలుపునిచ్చారు. వారు షరియా చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తే వారి గుడ్లు పీకేయాలి,చేతులు విరిచేయాలి. 

దొంగలు, నైతిక విలువల లేని వ్యక్తులు, ఇతరుల జీవితాలను నాశనం చేసే వారిని షరియా చట్టంలో ఇలాంటి కఠిన శిక్షలు విధించే నిబంధన ఉందని నాకు తెలుసు’ అని తెలిపారు. లవ్‌ జీహాద్‌ నిందితుల ఆస్తుల్ని పోలీసులు జప్తు చేయాలి. కఠినాతి కఠినంగా శిక్షించాలని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement