
మట్టి, గట్టు, చెట్టు, పుట్ట.. మన దేశంలో ప్రతీది పూజలకు అర్హత ఉన్నవే. అయితే ఇక్కడ ఓ ఊరు కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్(Electricity Transformer)కు ప్రత్యేక పూజలు చేసింది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ పూజలు ఎందుకో తెలుసా?
మధ్యప్రదేశ్ భింద్ గ్రామంలోని(Madhya Pradesh Bhind Village) గాంధీనగర్ ఏరియాలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ గత 15 సంవత్సరాలుగా సేవలందించి.. ఈ మధ్యే కాలిపోయింది. విద్యుత్ విభాగం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అసలే వేసవి కావడంతో రోజుల తరబడి ప్రజలు కరెంట్ లేక అల్లలాడిపోయారు. చివరకు.. స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుష్వాహను ఈ విషయమై సంప్రదించారు.
ఎమ్మెల్యే చొరవతో రెండే రెండు గంటల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను అధికారులు బిగించేశారు. దీంతో వాళ్లు సంబురం చేసుకున్నారు. కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి ట్రాన్స్‌ఫార్మర్‌కు పూజలు(Puja To Transformer) చేశారు. ఆపై స్వీట్లు పంచుకున్నారు. ఎందుకిలా చేశారని ఆరా తీస్తే..
ఆ గ్రామస్తులు మరోసారి అధికారులను నమ్ముకోవాలనుకోవడం లేదు. అలా నమ్ముకుంటే ఏం జరుగుతుందో వాళ్లను అనుభవం అయ్యింది కదా. ‘‘అధికారులు ఎలాగూ సక్రమంగా పని చేయరు. అందుకే చాలాఏండ్లు పని చేయాలని ఈ కొత్త ట్రాన్స్‌ఫార్మరే కోరుకుంటూ పూజలు చేశారంట. హా.. షాకయ్యారా! అదన్నమాట అసలు సంగతి.
ఇదీ చదవండి: పులిని పుట్టుకుని సెల్ఫీకి యత్నించి..