ట్రక్కును ఢీకొన్న వాహనం.. ఏడుగురు భక్తులు మృతి | Road Accident At Madhya Pradesh Sidhi District | Sakshi
Sakshi News home page

ట్రక్కును ఢీకొన్న వాహనం.. ఏడుగురు భక్తులు మృతి

Mar 10 2025 8:56 AM | Updated on Mar 10 2025 8:59 AM

Road Accident At Madhya Pradesh Sidhi District

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

వివరాల ప్రకారం..‘మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బహ్రీ వద్ద ట్రక్కు, ఎస్‌యూవీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరగుతోంది. అయితే, వీరంతా మైహార్‌ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం, ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement