
సోషల్‌మీడియాలో తరచుగా ఆసక్తికర కథనాలు, విశేషాలను పంచుకునే పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా ఒక ఆసక్తికర కథనాన్ని షేర్ చేశారు. యువపారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తినిచ్చేలా మైగేట్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ స్ఫూర్తిదాయకమైన కథను ఆయన పంచుకున్నారు
సెక్యూరిటీ అండ్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ యాప్ మైగేట్ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సక్సెస్ స్టోరీని హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా సక్సెస్ ఎవరికీ అంతఈజీగా రాదు.. దానికి వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఒకపుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తి ఇపుడు , కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ యాప్ ఫౌండర్‌గా సీఈవోగా ఎదిగిన తీరును ఆయన వివరించారు.
In 2016, IIT grad & ex-Goldman exec Abhishek Kumar became a security guard working 14-hour shifts.
That experience of understanding pain points led to his creating MyGate: now in 25,000+ communities, 100M+ check-ins/month.
Moral: To build for others, first walk in their shoes. pic.twitter.com/7UZSScpRaD— Harsh Goenka (@hvgoenka) July 3, 2025
r> IIT గ్రాడ్యుయేట్ , మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన కుమార్ ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా 14 గంటల షిఫ్టులు పనిచేశారని గోయెంకా వెల్లడించారు. ఆ కష్టాలు,కన్నీళ్లు, ఆఅనుభవమే తరువాత ‘మైగేట్’ పునాదిగా మారిందని హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ఏదైనా ఒక పనిచేపట్టాలంటే ముందు దానిలోని లోతుపాతులను అర్థం చేసుకోవాలన్నారు.
ఎవరీ అభిషేక్ కుమార్ :
సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన తర్వాత ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యారు. అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి మరియు శ్రేయాన్స్ దాగా కలిసి 2016లో మైగేట్‌ను ప్రారంభించారు. 2022లో, అర్బన్ కంపెనీ - అకో సంయుక్తంగా నిర్వహించిన నిధుల రౌండ్‌లో మైగేట్ రూ. 100 కోట్లు సేకరించింది.2024 ఏప్రిల్‌లో మైగేట్ CEOగా నియమితులయ్యారు, విజయ్ అరిసెట్టి బోర్డు ఛైర్మన్‌గా మారారు. మైగేట్ అనేది గేటెడ్ కమ్యూనిటీలకు సెక్యూరిటీ కమ్యూనికేషన్, హౌస్ కీపింగ్, ఇతర రోజువారీ సేవలను అందిస్తుంది. భారతదేశంలోని 25 వేల హౌసింగ్ సొసైటీలలో ఇప్పుడు 40 లక్షలకు పైగా జనం మైగేట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా చెక్-ఇన్‌లను సులభతరం చేస్తుంది.డిజిటల్ హోమ్ సెక్యూరిటీని అందించే స్మార్ట్ డోర్ లాక్‌ల శ్రేణి మైగేట్ లాక్స్ ద్వారా మైగేట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ ఆదాయం అంతుకుముందు ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.77 కోట్ల నుండి రూ.109 కోట్లకు పెరిగింది. 2025 ఏడాది గాను రూ. 165 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుందని పంచుకుంది. \

2016లో అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి , శ్రేయాన్స్ డాగా స్థాపించిన మైగేట్, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులకు ఏకీకృత యాప్ ద్వారా సందర్శకుల యాక్సెస్, భద్రత, నిర్వహణ,నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు బీమాసర్వీసులను అందించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుండి లైసెన్స్‌ను కూడా పొందింది.
ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా