
మనతో ఉన్న వస్తువులు లేదా మనుషుల విలువ ఉన్నంత వరకు తెలియదు అని పెద్దలు పదేపదే నొక్కి చెబుతుంటారు. అదెందుకో ఈ కథ చదువుతుంటే తెలుస్తుంది. అన్నిసార్లు డబ్బు మన అవసరాలను తీర్చదు. అదొక్కటే చాలు అనుకున్న వాళ్లంతా అధోగతిపాలయ్యారు. తెలిసి కూడా అదే తప్పు చేస్తూ..ఒంటిరిగా మిగిలిపోయి కుమిలిపోతుంటారు ఈ వ్యక్తిలా..
అసలేం జరిగిందంటే..జపాన్‌కి చెందిన టెట్సు యమడ, కైకో దంపతులు సుదీర్ఘకాలం కలిసిమెలిసి ఉన్నారు. వారికిద్దరు కుమారులు కూడా. వాళ్లు కూడా సెటిల్ అయిపోయారు. అయితే ఏమైందో గానీ వెర్రిగా ఆలోచించి మొదటికే మోసం తెచ్చుకున్నాడు.
అతడు ఇటీవల రూ. 3 కోట్ల పెన్షన్‌తో రిటైరయ్యాడు. దాంతో ఇక ఇన్నాళ్లు సంసారాన్ని మోసింది చాలు ఇకనైనా ఫ్రీడం కావాలంటూ..తన భార్యను పుట్టింటికి వెళ్లిపో విడిగా బతుకుదాం ఇకనుంచి.. అని మనసులో మాట చెప్పేశాడు యమడ. అయితే ఇన్నాళ్లు తనతో కలిసి జీవించి ఇదేంటి అనుకుందామె. నిజానికి ఆ దంపతులకు గత కొన్నేళ్లుగా కొన్ని విషయాల్లో పొసగటం లేదు. ఎలాగో రిటైరవ్వతున్నాకదా..ఆమెను వదిలించేసుకుని రిటైర్మెంట్ డబ్బుతో హాయిగా జీవించొచ్చనేది అతడి ఆలోచన.
అయితే అన్నేళ్లుగా పట్టణంలో కుమారులు, భర్తతో కలిసి జీవించి ఉన్న ఆమెకు ఉన్న పళంగా తన సొంతూరు పల్లెటూరికి వెళ్లి బతకడం అనేది కష్టంగా అనిపించిందామెకు. ఆ విషయాన్నే నర్మగర్భంగా చెప్పేసింది యమడకి. అలాగే అతడి కొడుకులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. దాంతో అతడు 'సోట్సుకోన్' ట్రెండ్‌ని అనుసరిద్దామని చెప్పాడు. ఏంటంటే ఇది..జపాన్ మహిళ రచియిత్ర రచించిన పుస్తకం కారణంగా ఈ ట్రెండ్ అక్కడ యువతలో బాగా ఊపందుకుంది.
ఈ ట్రెండ్ ప్రకారం..భార్యభర్తలు ప్రెండ్లీగా విడిపోతారు..ఒకే ఇంట్లో ఉన్నా..ఎవరికి వారు హాయిగా ఉండటం లాంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈ పద్ధతిలో ఫ్రెండ్లీగా విడిపోదామని చెప్పి యమడనే తన సొంత గ్రామానికి వెళ్లిపోయి జీవించాలని నిర్ణియించుకున్నాడు. ఇక అతడి భార్య, కుమారులు అక్కడే పట్టణంలో నివశించడానికి మక్కువ చూపించారు.
పాపం పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి..
ఇక యమడ గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన అక్కడ తన పెన్షన్ డబ్బుతో ఇంటిని పునరుద్ధరించాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేద్దామనుకుంటే..అక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు భార్య అమర్చి పెడితే కష్టం తెలియకుండా పోయింది యమడకి. ఇక ఎప్పుడైతే ఒంటిరిగా జీవించడం మొదలుపెట్టాడో..రోజువారీ పనులు నిర్వహించుకోవడం చాలా కష్టమైంది.
వంట చేసుకుని తినలేక తిప్పలు పడ్డాడు. ఇక రెడీమేడ్ న్యూడిల్స్, పచ్చి కూరగాయలపై ఆధారపడాల్సిన స్థితికి వచ్చేశాడు. కానీ అతడి భార్య విడిపోయాక సొంతంగా చేతి వృత్తికి సంబంధించిన వర్క్‌షాప్ ప్రారంభించి లాభాలు అందుకుంటూ సంతోషంగా జీవిస్తుంటే ఇక్కడ యమడ..ఒంటరి జీవితంతో నరకం అనుభవిస్తున్నాడు. అంతేగాదు తాను తీసుకున్న ఈ తెలివి తక్కువ పనికి చింతిస్తూ లబోదిబోమంటున్నాడు.
అయితే తాము అప్పడప్పుడూ ఆన్‌లైన్ మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు యమడ. అయితే తన కొడుకులతో సంబంధం పూర్తిగా తొలిగిపోయిందని అంటున్నాడు. పాపం యమడ తన కుటుంబంతో మళ్లీ తిరిగి కలసే అవకాశం కోసం ఆశగా చూస్తున్నాడు. ప్రస్తుతం అతడి కథ నెట్టింట వైరల్‌గా మారి విడిపోతే నష్టం ఎవరికీ అంటూ చర్చలు ప్రారంభించారు. అంతేగాదు స్వేచ్ఛ అనేది ఎలా ఉన్నా ఆ వయసులో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు మాత్రం తప్పవనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
🚨 LONELY NOODLES AND A NEW LIFE: JAPAN’S ‘MARRIAGE GRADUATION’ TREND SPARKS DEBATE
Tetsu Yamada thought he was stepping into a peaceful retirement when he embraced “sotsukon”—Japan’s rising trend of “marriage graduation.” Armed with a hefty 50-million-yen pension, he moved to… pic.twitter.com/0KVXZwRFzP— The Tradesman (@The_Tradesman1) August 17, 2025
(చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!)