
కాసిపేట: సర్కారు కొలువు సాధించడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఏఈ (ఆపరేషన్)గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటులో రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం పాతబస్తీ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు చల్ల రమేశ్, రమాదేవి దంపతులు మంచిర్యాల వినూత్న కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు చల్ల ఆదర్శ్ 2018లో సింగరేణి (Singareni) సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఓవర్‌మెన్‌గా ఎంపికయ్యాడు.
ఉన్నతోద్యోగం సాధించాలనే లక్ష్యంతో అందులో చేరలేదు. ఆ తర్వాత రైల్వేశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. 2021లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీపీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం (Junior Engineer Job) సాధించాడు. 2022లో రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి సిర్పూర్ ఏఈగా విధుల్లో చేరాడు. గ్రూప్స్ సాధించడమే లక్ష్యంగా సాగుతున్న క్రమంలో ఏఎండీ ప్రాసెసర్ ప్రైవేటు కంపెనీలో రూ.50 లక్షల ప్యాకేజీతో నియామకం అయ్యాడు. ఈ ఉద్యోగంలో చేరుతున్నానని, ఎప్పటికైనా గ్రూప్స్ సాధించడమే తన లక్ష్యమని ఆదర్శ్ తెలిపారు.
చదవండి: అమెరికా నుంచి వచ్చి ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేసిన ఎన్నారై