జాతీయస్థాయికి చెన్నూర్ విద్యార్థిని ఎంపిక
చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ వేదికగా గతేడాది అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహించిన వీర్‌గాధ 5.0 పోటీలలో పట్టణంలో ని శార్వాణి పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని తాండ్ర స్వరమంజుప్రియ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. దేశ భద్రతకు అనుక్షణం శ్రమిస్తూ ప్రాణాలు పణంగా పెట్టి శత్రుదుర్బేద్యంగా దేశాన్ని మార్చిన అమర జవానుల స్మారకార్థం పోటీలు నిర్వహించినట్లు తెలిపా రు. దేశవ్యాప్తంగా 50 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. సైని కుల త్యాగాలపై విద్యార్థిని రాసిన పద్యం జాతీ య స్థాయికి ఎంపికై ందన్నారు. సదరు విద్యార్థినిని పాఠశాల కరస్పాండెంట్ మేడ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు అభినందించారు.


