ముగిసిన న్యాయవాదుల క్రికెట్ పోటీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో న్యాయవాదులకు రెండు రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిసాయి. మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరపు జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష, ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి రవితేజ ప్రారంభించారు. పోటీల్లో ఐదు టీమ్‌లు పాల్గొనగా ఎల్లో టీమ్, వైట్ టీమ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎల్లో టీమ్ విజేతగా నిలిచింది. ఎల్లో టీమ్ కేప్టెన్‌గా ఆకుల రవీందర్, వైట్ టీమ్ కేప్టెన్‌గా దండనాయకుల మనోహర్‌రావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావ్, స్పోర్ట్స్ కన్వీనర్ వేణు, తుల ఆంజనేయులు, గడప ఉమేష్, రంజిత్‌పటేల్, న్యాయవాదులు పాల్గొన్నారు.


