
వ్యవసాయం, అన్నా డైరీ వ్యాపారం అన్నా లాభాలు రావేమో అనే భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఐదెంకల జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ విజయం సాధించారో ఐటీ జంట. సేంద్రీయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ పాల ఉత్పత్తులను అందిస్తూ ఏడాదికి కోట్లలో ఆర్జిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం వెనకాల ఒక విషాదగాథ కూడా ఉంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మాల్డే, అతని భార్య చార్మి మాల్డే తమ లాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐటీలో బీఈ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిప శ్రీకాంత్ దశాబ్ద కాలం ఐటీ కెరీర్‌ను వదిలేశారు.అలాగే కెమికల్ ఇంజనీర్ అయిన చార్మికూడా భర్తనే అనుసరించి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకుంది. అర్థవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనే ఉద్దేశంతోపాటు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో డైరీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. 2014లో ముఖ్యంగా శ్రీకాంత్ తండ్రి క్యాన్సర్‌తో మరణించడం వారిని ఆలోచింప చేసింది.
"> సేంద్రీయ వ్యవసాయంపై వారి పరిశోధన ఆవుల కీలక పాత్రను గుర్తించేలా చేసింది. కేవలం పాల కోసం మాత్రమే కాకుండా, ఆవు పేడ , మూత్రం వంటి సహజ ఎరువుల ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా అని గ్రహించారు.దీంతో 2017లో, కేవలం నాలుగు గిర్ ఆవులతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గౌనీతి ఆర్గానిక్స్ ప్రారంభించారు. పాడి పరిశ్రమలో ముందస్తు అనుభవం లేకపోయినా, సానుకూల స్పందన వారికి ఊతమిచ్చింది. మొదటి 5-6 సంవత్సరాలు కొన్ని చాలెంజెస్ విసిరినీ,వాటిని అధిగమించారు. ఎన్ని కష్టాలొచ్చినా కానీ స్వచ్ఛమైన, కల్తీ లేని పాలను అందించాలనే పట్టుదలతో కొనసాగాగారు. ఆహార కల్తీ, అనారోగ్యకరమైన ఆహారంపై ఆందోళన, సహజమైన, నమ్మదగిన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న జనం వీరికి బ్రహ్మరథం పట్టారు. అలా కేవలం నాలుగు ఆవులతో ప్రారంభమై 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 కోట్లకుపైగా టర్నోవర్‌ను చేరుకున్నారు.
తమ పాల వ్యాపారం కోసం గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన స్థానిక భారతీయ జాతి గిర్ ఆవులను ఎంచుకున్నారు. గిర్ ఆవులు బీటా-కేసిన్ ప్రోటీన్‌ను కలిగి ఉన్న పాలను ఉత్పత్తి చేస్తాయి. స్థానిక జాతులను ఎంచుకోవడం వల్ల స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సాంప్రదాయ పాల జ్ఞానాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని వీరి విశ్వాసం .
“మా దృష్టి పాల ఉత్పత్తిపైనే కాదు, నైతిక, క్రూరత్వం లేని పద్ధతులపై ఉంది. దూడ జన్మించిన తర్వాత, ఏదైనా పాలు పితికే ముందు తగినంత ఆహారం ఇవ్వడానికి అనుమతిస్తారు. ఇది ఆవులు ఆక్సిటోసిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, దీనిని తరచుగా 'హ్యాపీ హార్మోన్' అని పిలుస్తారు, ఇది సహజంగా పాల నాణ్యతను ,జంతువు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంటారు శ్రీకాంత్. నాణ్యతను అందించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. జెర్సీ ఆవు రోజుకు 25 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదు, కానీ గిర్ ఆవు 8 నుండి 10 లీటర్లు మాత్రమే దిగుబడి ఇస్తుంది. ఇది కాల క్రమేణా తగ్గిపోతుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఎటువంటి హార్మోన్లు ఇవ్వమనీ, సేంద్రీయ పచ్చి మేతతో నాణ్యతను కాపాడుకోవడానికి చాలా అవసరమనిచెప్పారు.
చదవండి: 37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
ఆవులకు సేంద్రీయ మేత
ఆవులకు పురుగుమందులు లేకుండా పండించిన సేంద్రీయ మేతను తినిపిస్తారు. పోషకాహారాన్ని పెంచడానికి కాలానుగుణ సర్దుబాట్లు చేస్తారు. టిబి, జాన్స్ వ్యాధి , బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధులకు ప్రతి 4 నుండి 6 నెలలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు.
చదవండి: భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్‌వీర్ న్యూ లుక్ వైరల్
ప్రస్తుతం 100 ఆవులతో, ఆర్గానిక్ పాలు, వెన్న, నెయ్యి, అగరుబత్తులను కూడా విక్రయిస్తున్నారు. అంతేకాదు స్థానిక మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తుంది. అభిరుచి, పట్టుదలతో పాటు, తాము అందించే ఉత్పత్తుల్లో స్థిరత్వాన్ని, నాణ్యతను అందిస్తే విజయం వంగి సలాం చేస్తుందనటానికి ఈ దంపతులు నిదర్శనంగా నిలిచారు
ఇదీ చదవండి: అర్రే... క్షణంలో రూ. 25 లక్షలు మిస్.. కానీ అదే తెలివైన పని!