
పట్టుచీరలో మెరిసిపోయింది
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్‌ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్‌లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.
అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్ , ఇతర టెంపుల్ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్ ధోతీని ధరించాడు.
అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
అనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి.
అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది.
కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్, యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్‌లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు అనుశ్రీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది.