
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వస్తున్న టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 17' (KBC 17) తాజా ఎపిసోడ్‌లో, బీహార్‌కు చెందిన మిథిలేష్ దురదృష్టవశాత్తూ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీని పోగొట్టుకున్నాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసినప్పటికీ కేవలం రూ. 25 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో గెలిచిన తర్వాత, షోలో హాట్ సీట్‌లో కూర్చుని అన్ని వరుసగా అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చాడు. రూ. 50 లక్షల బహుమతిని గెల్చుకునే సమాధానం వద్ద సందిగ్ధంలో పడిపోయాడు.(భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్‌వీర్ న్యూ లుక్ వైరల్)
ప్రశ్న: "ఢిల్లీ ఎర్రకోటను రూపొందించిన ఆర్కిటెక్ట్ తన పేరు మీద ఒక నగరం పేరును కలిగి ఉన్నాడు. అది ఏ నగరం?" ఆప్షన్స్ "ఎ. ఇస్తాంబుల్, బి. హెరాత్, సి. లాహోర్, డి. మషాద్"
సరైన సమాధానం లాహోర్. సమాధానం ఇవ్వలేకపోయాడు షో నుంచి నిష్క్రమించి రూ. 25 లక్షలతో వెళ్ళిపోవలసి వచ్చింది. ఆట నుండి నిష్క్రమించే ముందు, సమాధానం ఎంచుకోమని అడిగారు బిగ్‌బీ. అయితే మిథిలేష్ కరెక్ట్ సమాధానం లాహోర్‌నే ఎంచుకున్నాడు. కానీ అప్పటికే షో నుంచి వైదొలిగాడు కాబట్టి. అతనికి రూ. 25 లక్షలే ముట్టాయి. ఒక వేళ షోనుంచి నిష్ర్రమించకుండా సమాధానం తప్పుగా చెప్పి ఉంటే అతని ప్రైజ్‌మనీ రూ. 3.2 లక్షలకు పడిపోతుంది. (బాయ్ ఫ్రెండ్‌తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్)
ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట 17వ శతాబ్దపు ప్రఖ్యాత మొఘల్ వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరికి దక్కింది. తాజ్ మహల్ ప్రధాన వాస్తుశిల్పిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ.
అంతుకుముందు అమితాబ్‌తో సంభాషణలో భాగంగా మిథిలేష్ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేశాడు. ఎన్ని కష్టాలెదురైనా, తన సోదరుడిని చదివించి, మంచి భవిష్యత్తునివ్వాలనేది తన డ్రీమ్ అని మిథిలేష్ తెలిపాడు. అలాగే పుట్టినరోజును తనతో జరుపుకోవాలని పట్టుబట్టే వైనాన్ని గురించి కూడా చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: అత్తి పండ్లతో అదిరిపోయే ప్రయోజనాలు.. లైంగికశక్తికి కూడా!