
ప్రకృతి దగ్గరగా జీవించాలని, ఆర్గానిక్ ఆహారాన్ని మాత్రమే తినాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆచరణ ఎలాగో అర్థంకాదు. అలా నిస్తేజంగా, నిర్జీవంగా జీవితం గడపకుండా, పచ్చని ప్రకృతి,స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని భోజనమే జీవితం అనుకుంది స్నేహా రాజ్‌గురు. ఇది తన ఒక్కదానికే పరిమితం కాకుండా తన తండ్రితో కలిసి ‘బాప్ బేటీ ఫామ్స్’’ పేరుతో సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతోంది. ఎవరీ స్నేహ, తెలుసుకుందాం పదండి.
స్నేహ రాజ్‌గురు పుణెలో పుట్టి పెరిగింది. ఇద్దరు అన్నయ్యలు. తండ్రి అనిల్ రాజ్‌గురు. స్నేహ రాజ్‌గురు సినిమాల్లో పనిచేస్తానంటే సంపూర్ణ మద్దతిచ్చారు. స్నేహ బాలీవుడ్‌లో స్క్రిప్ట్ సూపర్‌వైజర్‌గా, ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసింది, 'బుల్బుల్', 'లుకా చుప్పి' వంటి సినిమాలకు పనిచేసింది. వృత్తిలో భాగంగా భారతదేశం అంతటా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలోనే ఆమె జీవితం మలుపుతిరిగింది. ‘లూకా చుప్పి’ సినిమా లొకేషన్ల కోసం మదురై వెళ్లింది. అక్కడి ప్రకృతి, మట్టితో కట్టిన ఇళ్లు చూసి పరవశించి పోయింది. అపుడే నిర్ణయించుకుంది..ప్రకృతిలో మమేకమవుతూ, సేంద్రియ ఆహారాన్ని సేవిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని.
మట్టిలో మెరుపు
పశ్చిమ బెంగాల్ అడవులలోని పెర్మాకల్చర్ ఫామ్‌లో 52 రోజుల బస చేయడం తన ఆలోచనలకు మరింత బలం వచ్చింది. అలంకరణలు లేవు, ఫిల్టర్లు లేవు, కేవలం ఒక టెంట్, అడవి. స్నేహ ఇక్కడే పెర్మాకల్చర్ సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ప్రకృతిని వినడం, వర్షంలో లయను, కలుపు మొక్కలలోని జ్ఞానాన్ని చూడటం నేర్చుకుంది. అలా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన వృత్తిని వదిలిపెట్టి, తన తండ్రి అనిల్ రాజ్‌గురుతో కలిసి పూణే సమీపంలో 'బాప్ బేటీ ఫామ్స్'ను ఏర్పాటు చేసింది.
బాప్ బేటీ ఫామ్స్ (BaapBeti Farms)
"నేను కథలు చెప్పడం మాత్రమే కాదు.. ఆ కథల్లో ఈ ప్రకృతిలో జీవించాలనుకున్నాను. అదే నన్ను భూమికి అనుసంధానించినది. భూమినుంచే తీసే తాజాగా తినే ఆహారం, పాలిష్ చేయని, ప్రాసెస్ చేయని , స్వచ్ఛమై ఆహారంతో నా సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసింది”అంటారు స్నేహ.
ముంబైలో తన జీవితాన్ని సర్దుకుని పూణేకు తిరిగి వచ్చింది. బ్యాకప్ ప్లాన్ ఏమీ లేదు. ఉన్నదల్లా నమ్మకం. ఓర్పు, అభిరుచే పెట్టుబడి. దీనికి కూతురి కలలకు అండగా నిలిచిన తండ్రి తోడ్పాటు, పెర్మాకల్చర్‌లో కోర్సులు, భూమి భాషను అధ్యయనం తోడైంది. టాటా మోటార్స్ పనిచేస్తున్న పదవీ విరమణకు దగ్గరగా ఉన్న స్నేహ తండ్రి అనిల్ రాజ్ గురు తొలుత ఆమె నిర్ణయానికి విస్మయం చెందాడు. అయితే “స్నేహ ఎప్పుడూ ఆరుబయట ఉండటం ఇష్టపడేది. చిన్నప్పుడు కూడా, ఆమె నేల వైపు ఆకర్షితురాలైంది," అని గుర్తు చేసుకుంటారుపూణే దగ్గర ఉందీ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ సేంద్రీయ కూరగాయలు, పళ్లు పండిస్తారు. అందుకే ఆమె వ్యవసాయం గురించి ప్రస్తావించగానే మారు మాట్లాడకుండా ఆమెతో చేయి చేయి కలిపారు.
పూణే బయట బంజరుగా ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని కనుగొన్నారు. విత్తనాలు నాటారు. భూమిని పెర్మాకల్చర్ జోన్‌లుగా విభజించారు, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, అందంగా అమర్చుకున్న పర్యావరణ వ్యవస్థ. పక్షులు, తేనెటీగలు, కూరగాయలు, కోళ్లు, కంపోస్ట్ కుప్పలు - ప్రతిదీ ఈ పచ్చని సోయగంలో తన పాత్రను పోషించింది.

ప్రతీ ఆకులో ఒక వారసత్వాన్ని వెతుక్కున్న వారి కృషి ఫలించింది. స్ట్రాబెర్రీల నుండి లెట్యూస్, క్యాప్సికమ్ వరకు స్థానిక ఉత్పత్తులలో ప్రయోగాలు వరకు, బాప్‌బేటి ఫామ్స్ పూర్తిగా సేంద్రీయం మారిపోయింది. వ్యక్తిగత ప్రయాణంగా ప్రారంభమై, ఉద్యమంగా మారింది. స్నేహ ఈ పొలాన్ని Airbnbలో జాబితా చేసింది, అతిథులను స్థిరమైన జీవనశైలిని అనుభవించమని ఆహ్వానించింది. నగరవాసులు క్యూ కట్టారు. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతోమంది రైతులకు మార్గ నిర్దేశకులయ్యారు. ఆమె తండ్రి అనధికారిక టూర్ గైడ్ అయ్యాడు. అంతేకాదు నచ్చిన పనిచేస్తూనే ప్రతి ఉదయం ప్రకృతిలో నడక. దీంతో సుగర్ నియంత్రణలోకి వచ్చింది. 18 కిలోగ్రాముల బరువ తగ్గాను అంటూ సంతోషంగా చెబుతారు అనిల్. అన్నింటికంటే ముఖ్యం నా బిడ్డ కల సాకారంలో నేను ముఖ్య భూమికనయ్యాను అంటారు.
సంపానదకదు ముఖ్యం
బాప్ బేటి ఫామ్స్ నెలకు రూ.80 వేలకు పైగా సంపాదిస్తుంది. కానీ తనకు డబ్బు కాదు ముఖ్యం. ప్రకృతిలో జీవించడం, వ్యవసాయ క్షేత్రం స్వయం సమృద్ధిగా, నిరంతరం అభివృద్ధి చెందడం. అలాగే ఏ హాలీవుడ్ చిత్రం రాయలేని ట్విస్ట్‌లు, విలువల కంటే మేటి జ్ఞానం.అదే నిజమైన బహుమతి అంటారు స్నేహ.