
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ శైలితో ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థానీ టై-డై టెక్నిక్ సాంప్రదాయ దుస్తులలో అమ్మ వారి ఆరాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో సందడిగామారాయి.
దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే బహుళ వర్ణ బనారసి పింక్ లెహంగా చోళిలో అత్యంత సుందరంగా కనిపించారు. దీనిపై వివిధ రకాల బట్టలతో ప్యాచ్‌వర్క్, క్లిష్టమైన జరీ వర్క్, సంక్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహంగాలో భారీ లేస్‌వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కర్ట్‌కు మ్యాచింగ్‌గా ప్యాచ్‌వర్క్ , బంగారు జరీ వర్క్‌తో పింక్ బ్లౌజ్‌ను ఆమె ఎంచుకున్నారు. గులాబీ , నారింజ రంగు లెహెరియా ప్రింట్ దుపట్టాతో నీతా అంబానీ లుక్‌మరింత ఎలివేట్ అయింది. మల్టీ లేయర్డ్ డైమండ్స్, ఆకుపచ్చ పచ్చ నెక్లెస్‌తో పాటు స్టేట్‌మెంట్ చెవిపోగులు, మాంగ్ టికా, రంగురంగుల గాజులు, హెవీరింగ్‌ను ధరించారు.
ఈ కాస్ట్యూమ్స్‌ను ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ JADE మోనికా అండ్ రిష్మా రూపొందించారు. నీతా అంబానీ లుక్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. గుజరాత్ ఆత్మ నుండి ప్రేరణతో పవిత్రమైన మూలాంశాలు ,శక్తివంతమైన కచ్చి వస్త్రాలతో కూడిన దైవిక నేపథ్యంలో నీతా అంబానీ లుక్ సజీవంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
(Weight Loss వెయిట్ లాస్‌లో ఇవే మెయిన్ సీక్రెట్స్)
అంతేకాదు అంబానీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఐలైనర్, కోల్-ఐడ్, మస్కారా-కోటెడ్ లాషెస్, బ్లష్డ్ బుగ్గలు, రేడియంట్ హైలైటర్, న్యూడ్ లిప్‌స్టిక్‌తోపాటు, మిడిల్-పార్టెడ్ బన్ హెయిర్‌స్టైల్ , నుదిటిపై ఎర్రటి బొట్టు తదితర వివరాలను అందించారు.
(సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు)
నెటిజన్ల స్పందన
సోషల్ మీడియా వినియోగదారులు ఆమె సొగసైన స్టైలింగ్‌ను ప్రశంసించారు. నవరాత్రి క్వీన్‌కు అవార్డు నీతా అంబానీ జీకి దక్కుతుంది. ఎలిగెంట్ రాయల్, చాలా అందంగా ఉన్నారంటూ కొనియాడటం విశేషం.