
ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ కో ఫౌండర్, సీఈవో శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ఖరీదైన తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. హవాయిలోని బిగ్ ఐలాండ్‌లోని తన సముద్ర తీర భవనాన్ని విక్రయిస్తున్నట్లు ఫోర్బ్స్ నివేదించింది. అసాధారణమైన అధునాతమైన భద్రతా ఫీచర్లు కలిగి ఉన్న ఈ భవనాన్ని రెండు వారాల క్రితం అమ్మకానికి పెట్టినట్టు సమాచారం.
10 బెడ్‌రూమ్‌ల ఈ ఎస్టేట్ రూ. 434.63 కోట్ల విలువ చేస్తుంది. అమ్మకాన్ని నిర్వహిస్తున్న సోథెబీ ఏజెంట్ బ్రియాన్ ఆక్సెల్‌రోడ్ దీనిని "నా కెరీర్‌లో నేను చూసిన అత్యంత అద్భుతమైన ఆస్తి" అని అభివర్ణించారు. ఆ ఆస్తి బిగ్ సర్ఫ్ LLC కింద నమోదు చేయబడిందని పబ్లిక్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ సంస్థ గతంలో ఆల్ట్‌మాన్ శాన్ ఫ్రాన్సిస్కో నివాసానికి అనుసంధానించబడి ఉంది. ప్రస్తుతం అతని నాపా వ్యాలీ రాంచ్, వెంచర్ క్యాపిటల్ కార్యకలాపాలకు అనుసంధానించబడి ఉంది.
చదవండి: సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు
2011లో నిర్మించిన ఈ ఎస్టేట్‌లో ఐదు బెడ్‌రూమ్‌ల గెస్ట్‌హౌస్, 10 బాత్రూమ్‌లు, ఒక ప్రైవేట్ బీచ్, ఒక సినిమా థియేటర్ ఉన్నాయి. తాజావార్తలపై లిస్టెడ్ మేనేజర్ఆల్ట్‌మన్ కజిన్ జెన్నిఫర్ సెరాల్టా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అటు OpenAI కూడా ఇంకా నిర్ధారించ లేదు.
ఆల్ట్‌మన్ 2021లో హవాయి ఎస్టేట్‌ను సుమారు రూ. 381.41కోట్ల కొనుగోలు చేశాడు. అదే సమయంలో తన శాన్ ఫ్రాన్సిస్కో ఇంటిని 27 మిలియన్ డాలర్లకు, 950 ఎకరాల నాపా రాంచ్‌ను 16 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఫోర్బ్స్ ప్రకారం ఆల్ట్‌మన్ నికర ఆస్తుల విలువ రూ. 17,739.90 కోట్లుగా అంచనా.
ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ